- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These are the problems caused by placing the roti pan upside down in the kitchen
వాస్తు టిప్స్ : వంటింట్లో రోటీ పాన్ ఇలా పెడుతున్నారా.. కష్టాలు తప్పవంట!
వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తప్ప కుండా వాస్తు నియమాలు పాటంచాలని చెబుతుంటారు వాస్తు నిపుణులు. ముఖ్యంగ వంట గది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎలాంటి వాస్తు దోషం ఉన్నా అది అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందుకే వంట గది విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతారు.
Updated on: Oct 06, 2025 | 9:19 AM

ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో రోటీ పాన్ ఉండటం అనేది కామన్. అయితే ఎప్పుడూ కూడా దీనిని వంట గదిలో తలకిందులుగా పెట్టకూడదని చెబుతుంటారు వాస్తు శాస్త్రనిపుణులు. అయితే చపాతీలేదా దోశ పాన్ వంట గదిలో తలకిందులుగా ఎందుకు పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది రోటీ చేసిన తర్వాత పాన్‌ను తలకిందులుగా పెడుతుంటారు. కానీ అలా పెట్టడం వలన వాస్తు శాస్త్రం ప్రకారం అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట. కాగా, అసలు రోటీ లేదా దోశ పాన్ వంట గదిలో తలకిందులుగా పెట్టడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో పాన్‌ను తలకిందులుగ ఉంచడం చాలా అశుభకరమని భావిస్తారు. పాన్‌ను తలక్రిందులుగా ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వస్తుందంట, అంతే కాకుండా ఇంట్లో నిత్యం గొడవలు, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు పండితులు.

అదే విధంగా ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పుల సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు. శ్రేయస్సు తగ్గిపోవడం ఇంట్లో ఘర్షణ పెరగడం వంటివి జరుగుతాయంట. అందుకే వంటగదిలో ఎలాంటి పరిస్థితిలో కూడా రోటీ లేదా దోశ పాన్‌ను తలకిందులుగా పెట్టకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం రోటీ పాన్ తల కిందులుగా పెట్టడం వలన కెరీర్, వ్యాపారలంలో కూడా అనేక నష్టాలు చవిచూడాల్సి వస్తుందంట. ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో డబ్బు కొరత అధికంగా ఉంటుంది. అలాగే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా ఒక వేళ రోటీ చేసిన తర్వాత పాన్‌ను స్టవ్ పై పెట్టడం వలన కూడా అనపూర్ణదేవిని అవమానించినట్లు అవుతుందంట.



