Heart Attack in Winter: చలికాలంలోనే హార్ట్ ఎటాక్ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత సమమ్యలతో బాధపడతున్నారు. ఇందుకు గల అనేకానేక కారణాల్లో జీవనశైలి ఒకటి. ముక్యంగా ఈ సమస్య చలి కాలంలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఉదయం వేళల్లో గుండె పోటు ప్రమాదం అధికమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Updated on: Jan 27, 2025 | 2:01 PM

Heart Attack In Children

కాబట్టి శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ అన్ని ఛాతీ నొప్పులు గుండెపోటు లక్షణాలు కాదని గుర్తుంచుకోవాలి. గుండెపోటు వచ్చే ముందు దవడ, ఎడమ లేదా కుడి భుజం నొప్పి, క్రమంగా వీపు వంటి శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. అందుకే ఈ కాలంలో చెమటలు పట్టడం, ఆత్రుతగా అనిపించడం, దడ, అసౌకర్యం వంటి ఇతర లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటు మాత్రమే కాదు, చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, మెదడులోని రక్తనాళాలు పగిలిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఫలితంగా మెదడు కణాలు కూడా అకస్మాత్తుగా దెబ్బతింటాయి. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.

ఈ వ్యాధులన్నింటికీ ప్రధాన కారణం చలికాలంలో తక్కువ శారీరక శ్రమ. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటారు. అధిక కేలరీలు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

తేలికపాటి శారీరక శ్రమ చేయడం, ఆరుబయట ఉన్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం, కూరగాయలు, పండ్లు, అధిక ఫైబర్ కంటెంట్, తగినంత ప్రోటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.




