- Telugu News Photo Gallery Health Tips: is it healthy to eat banana and papaya together get expert advice
Ayurveda Tips: అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా.. ఈ ఆరోగ్య సమస్యలున్న వారు దూరంగా ఉండాల్సిందే..
రోజుకో పండు తినండి ఆరోగ్యంగా ఉండండి అని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది పండ్లను జ్యుస్, సలాడ్ రూపంలో తీసుకోవడనికి ఇష్టపడతారు. అయితే ఈ సలాడ్ తయారీలో రకరకాల పండ్లను కాంబినేషన్స్ ను ఉపయోగిస్తారు. తమ టెస్టుకు తగినట్లు .. ఆయా కాలంలో దొరికే పండ్లను సలాడ్ లో చేరుస్తారు. ఈ నేపథ్యంలో కొందరు అరటి పండు, బొప్పాయి ముక్కలను కూడా కలుపుతారు. ఇలా ఈ రెండు పండ్లను కలిపి తినడం వలన ఆరోగ్యమా.. అనారోగ్యమా పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..
Updated on: Jul 04, 2023 | 12:49 PM

ప్రకృతి మనిషికి అందించిన ఔషధాలలో పండ్లు ఒకటి. వీటిని రెగ్యులర్ గా లేదా సీజన్ లో దొరికే పండ్లను ఆయా సీజన్ లో తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే సలాడ్ రూపంలో లేదా రకరకాల పండ్లను కలిపి తినే అలవాటు ఉంటె.. అరటి పండు, బొప్పాయి పండు కలిపి తింటారు. ఈ అలవాటు వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసా..

సీజన్ తో పనిలేకుండా ఏడాదిపొడవునా దొరికే పండ్లలో అరటిపండు, బొప్పాయిలు ఉన్నాయి. వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా అని ఆలోచిస్తే.. ఖచ్చితంగా ఆరోగ్యానికి చెడు చేస్తాయి అని సమాధానం వస్తుంది. అయితే ఈ రెండు పండ్ల కాంబినేషన్.. జీర్ణవ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి అరటి పండు, బొప్పాయి రెండు ఆరోగ్యానికి మేలు చేసేవే.. అయితే అరటి, బొప్పాయి రెండు భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని కలిపి తినడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.. ముఖ్యంగా జీర్ణం తక్కువగా అయ్యేవారు తప్పని సరిగా అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సిందే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ రెండు పండ్ల కాంబినేషన్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలను సలాడ్ రూపంలో లేదా ఏ విధంగానైనా కలిపి తింటే వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అజీర్ణం, వాంతులు, వికారం, తలనొప్పి, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అసిడిటీ, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఆస్తమా, లంగ్స్ ప్రొబ్లెమ్స్, శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు ఈ పండ్ల కాంబినేషన్ ప్రమాదకమని చెప్పవచ్చు. ఉబ్బసం తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంది.





























