- Telugu News Photo Gallery Have an emotional fence to maintain healthy relationships lifestyle in telugu
Healthy Relationship: ఆరోగ్యకరమైన బంధాల కోసం భాగోద్వేగాల నియంత్రణ తప్పనిసరి.. కంచె ఎలా వేయాలంటే..
ఎవరైనా సరే జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలంటే.. . భావోద్వేగానికి గురయ్యే ఆలోచనలకూ దూరంగా ఉండాలి. మనుషుల మధ్య రిలేషన్ ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి భావోద్వేగానికి హద్దులు అవసరం
Updated on: Apr 04, 2023 | 4:20 PM

ఎవరైనా సరే జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలంటే.. . భావోద్వేగానికి గురయ్యే ఆలోచనలకూ దూరంగా ఉండాలి. మనుషుల మధ్య రిలేషన్ ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి భావోద్వేగానికి హద్దులు అవసరం. అంటే ఎవరికైనా స్వీయ నియంత్రణ తప్పనిసరి. మానసికంగా మిమ్మల్ని మీరు ఎలా నియంత్రించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

మీ భావోద్వేగాలు మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తాయి. కనుక మీ భావోద్వేగ ఆలోచనలకు ఉపయోగపడే పరిస్థితులు లేదా చర్యలు మీలో ప్రతికూల భావోద్వేగాలను ఏర్పరుస్తాయో మీరు మొదట అర్థం చేసుకోవాలి.

మీ భావోద్వేగ ఆలోచనలపై హద్దులే గురించి స్పష్టంగా ఉండాలి. అంతేకాదు వాటిని సమర్థవంతంగా ఇతరులకు తెలియజేయడం చేయడం చాలా అవసరం. మీ గందరగోళాన్ని లేదా ఆందోళనలను అవతలి వ్యక్తికి స్పష్టంగా తెలియజేయాలి

స్వీయ-సంరక్షణ కోసం సమయాన్ని వెచ్చించాలి. వ్యాయామం, ధ్యానం లేదా అభిరుచి వంటి స్వీయ-సంరక్షణ కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడం మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. అంతేకాదు మానసికంగా దైర్యంగా ఉండేలా చేస్తాయి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి.. భావోద్వేగాల ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఎవరికైనా "నో" అని చెప్పడం కష్టం.. అయితే భావోద్వేగానికి గురికాకుండా నో, అవును అని చెప్పడం అవసరం. ఏదైనా విషయంపై భావోద్వేగానికి లోనవుతున్నారని తెలుసుకోవడం.. మిమ్మల్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది. అన్నింటికీ నో చెప్పడం ఓకే. "లేదు" అని చెప్పడం వలన మీ భావాలకు విలువనిస్తుందని తెలుసుకోండి.

మీ భావోద్వేగాలను గౌరవించే, అర్థం చేసుకునే వ్యక్తుల నుండి మద్దతు మీకు ముఖ్యం. మిమ్మల్ని ఉద్ధరించే.. ప్రోత్సహించే, ఆరోగ్యకరమైన భావోద్వేగ అనుభవాలను కల్పించే వ్యక్తులతో కలిసి ఉండటం మంచిది.





























