- Telugu News Photo Gallery Happy Hug Day 2023: Why Is It Celebrated Of The Sixth Day Of Valentine's Week details here
Happy Hug Day 2023: వీలైతే కౌగిలించుకోండి డ్యూడ్.. హగ్ డే స్పెషాలిటీ, ప్రయోజనాలు ఏంటో తెలుసా..
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకోనున్నాం.. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా.. ప్రేమికులు ఈ రోజు హగ్ డే జరుపుకుంటున్నారు. మనం ఇష్టపడే వారిని కౌగిలించుకోవడానికి హగ్ డే ఒక ప్రత్యేకమైన రోజు.
Updated on: Feb 12, 2023 | 1:28 PM

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకోనున్నాం.. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా.. ప్రేమికులు ఈ రోజు హగ్ డే జరుపుకుంటున్నారు. మనం ఇష్టపడే వారిని కౌగిలించుకోవడానికి హగ్ డే ఒక ప్రత్యేకమైన రోజు. వాలెంటైన్స్ వీక్‌లో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడంలో ఆశ్చర్యం అవసరంలేదు. అసలు వాలెంటైన్స్ వీక్ అంటే ఏమిటి అనుకుంటున్నారా..? వాలెంటైన్స్ డేకి ముందు వారంపాటు సెలబ్రేట్ చేసుకోవడమే వాలెంటైన్స్ వీక్ అని పిలుస్తారు. ఫిబ్రవరి 7 నుంచి ఇది మొదలవుతుంది. వారంలోని ప్రతి రోజు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందుకే ప్రేమికులు వీటిని జరుపుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

వాలెంటైన్స్ డే వీక్ లో భాగమే ఫిబ్రవరి 12 హగ్ డే. మనం ప్రేమించే వ్యక్తికి మన ప్రేమను వ్యక్తం చేసే విధానంలో కౌగిలింత కూడా ఒకటి. అంతే కాదు మనం ఇష్టపడే వారిని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

సంతోషంలో మాత్రమే కాదు బాధలో ఉన్నప్పుడు కూడా కౌగిలింత ఓదార్పును ఇస్తుందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. కౌగిలింత అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తల్లిదండ్రులు - పిల్లల మధ్య, స్నేహితుల మధ్య కూడా ఉంటుంది.

కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఒత్తిడి - ఆందోళనను తగ్గిస్తుంది, సంతోషాన్నిస్తుంది, సంబంధాలను బలపరుస్తుందని.. అందుకే వీలైతే జస్ట్ హగ్ చేసుకోండి.. బ్రో.. అంటున్నారు మానసిక వైద్య నిపుణులు..

ఇద్దరు స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య కౌగిలింత అనేది భరోసాను ఇస్తుంది. అయితే, కాలక్రమేణా దీనిని కొందరు దురుద్దేశంతో చూస్తుంటారు.. కానీ అది మంచిది కాదంటున్నారు నిపుణులు.

అయితే, కౌగిలించుకునే ముందు వారి అనుమతి పొందాలి.. లేకుంటే లైంగిక వేధింపులుగా పరిగణించవచ్చు. కావున ఎవరైనా మీ హగ్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. హగ్ అనేది ఇరువురికి ఇష్టపూర్వకంగా ఉండాలి.. కానీ బలవంతంగా ఉండకూడదు..




