- Telugu News Photo Gallery Ghee Benefits for Skin: Why Ghee Is The Liquid Gold We All Must Have Daily
Ghee Benefits for Skin: రాత్రి నిద్రపోయేముందు పాదాలకు నెయ్యి రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
చర్మాన్ని అందంగా మెరిపించడానికి మార్కెట్‌లో ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వ్యాయామం, యోగా ద్వారా కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే నెయ్యి కూడా చర్మానికి మెరుపు తీసుకొస్తుంది. నెయ్యి ఆహారపు రుచిని పెంచడంతోపాటు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుంది. నెయ్యి వాడకూడదనుకుంటే దానికి బదులు కొబ్బరి నూనె లేదా కోకుమ్ బటర్ వాడవచ్చంటున్నారు నిపుణులు. నెయ్యి చర్మానికి ఏవిధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం..
Updated on: Dec 27, 2023 | 11:32 AM

నెయ్యిలో కేలరీలు ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే నెయ్యిలో సంతృప్త కొవ్వు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. కాబట్టి నెయ్యి తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నెయ్యి శరీరంలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నెయ్యిలో ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా అన్ని పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. సరైన శరీర బరువును నిర్వహించడం సులభం అవుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి కాల్షియం శోషణలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

నెయ్యిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉండదు. బదులుగా రోజంతా పూర్తి శక్తితో ఉండవచ్చు. ఇది పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.