- Telugu News Photo Gallery From Digestion To Skin Health 5 Benefits Of Drinking Hot Water Telugu News
Health Tips: గోరువెచ్చని నీటిలో వీటిని కలుపుకుని తాగితే ఎలాంటి రోగమైనా పరార్..!
గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియ నుంచి చర్మ ఆరోగ్యం వరకు అనేక లాభాలు చేకూరుతాయి. దాంతో పాటు రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసుకుని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, నెయ్యి, తేనె వంటి కషాయాలను తయారు చేసుకుని తాగటం వల్ల అది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 03, 2024 | 7:52 PM

దాల్చిన చెక్క: రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో దాల్చిన చెక్క తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్కను వేసి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

లవంగాలు: రోజూ తాగే గోరువెచ్చని నీటిలో లవంగాలు కలుపుకుంటే తలనొప్పి సమస్య తక్షణమే పరిష్కారమవుతుంది. లవంగాల లో యూజినాల్ అనే మూలకం ఉంది. ఇది గ్యాస్, అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. అధిక ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పురుషులు గోరువెచ్చటి నీటితో రెండు లవంగాలు కలిపి తీసుకోవటం వలన వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. సంతాన సాఫల్య సమస్యలు తగ్గుతాయి

నెయ్యి : గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు పొడిబారడంతో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నెయ్యి గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల నెయ్యి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్యకు చెక్ పెట్టాలంటే గోరువెచ్చని నీటిలో దేశీ నెయ్యి కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి, ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిని తాగాలి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తేనె: రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక టీస్పూన్ తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

జీలకర్ర: గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. దీంతో రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.జీలకర్రను గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల అందం మెరుగుపడుతుంది.




