AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: మణిపూర్‌లో ఆగని అల్లర్లు.. ఆయుధాల లూటీకి యత్నం.. చివరికి

మణిపుర్‌లో చెల్లరేగిన అల్లర్లు ఇంకా ఆగడం లేదు. తాజాగా అక్కడ ఇండియన్ రిజర్వు బెటాలియన్ ఉంటున్న ప్రాంతం వద్దకు అల్లరి మూకలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ సైనికులు వాడుతున్న ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి.

Aravind B
|

Updated on: Jul 05, 2023 | 12:26 PM

Share
మణిపుర్‌లో చెల్లరేగిన అల్లర్లు ఇంకా ఆగడం లేదు. తాజాగా అక్కడ ఇండియన్ రిజర్వు బెటాలియన్ ఉంటున్న ప్రాంతం వద్దకు అల్లరి మూకలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ సైనికులు వాడుతున్న ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి.

మణిపుర్‌లో చెల్లరేగిన అల్లర్లు ఇంకా ఆగడం లేదు. తాజాగా అక్కడ ఇండియన్ రిజర్వు బెటాలియన్ ఉంటున్న ప్రాంతం వద్దకు అల్లరి మూకలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ సైనికులు వాడుతున్న ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి.

1 / 5
అయితే ఈ ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ధౌభాల్ జిల్లాలోని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడికి వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్ పోస్టుపై దాడులకు పాల్పడ్డాయి. బెటాలియన్‌కు మద్ధతుగా సైన్యం, ఆర్పీవో లాంటి దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందుగానే తవ్వాయి.

2 / 5
 అయినప్పటికీ అస్సాం రైఫిల్స్‌, ఆర్పీవో దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో ముప్పు తప్పింది. వీళ్లు అల్లరిమూకలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.  ఈ క్రమంలోనే ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.

3 / 5
 ప్రస్తుతం మణిపుర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అక్కడ రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చినవారిలో ఇప్పటికి దాకా 326 మందిని అరెస్టు చేశారు.

4 / 5
బుధవారం తెల్లవారు జామున మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఉదయం 4.30 గంటలకు తూర్పు ఫైలింగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అలాగే మంగళవారం రాత్రి కూడా ఖోయిజుంతాబి ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అయితే ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.

5 / 5