వీటి గురించి మీకు తెలుసా..? ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి పెను ప్రమాదమట..!

ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలాముఖ్యం.. మంచి జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.. అలాంటి ఆరోగ్యకరమైన వాటిల్లో చియా గింజలు ఒకటి.. చియా సీడ్స్ ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు.

|

Updated on: Sep 16, 2024 | 6:15 PM

ప్రస్తుతకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలాముఖ్యం.. మంచి జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.. అలాంటి ఆరోగ్యకరమైన వాటిల్లో చియా గింజలు ఒకటి.. చియా సీడ్స్ ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ విత్తనాలను స్మూతీస్, పెరుగు, అనేక ఇతర ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. సాధారణంగా చియా సీడ్స్ ను నానబెట్టి.. ఉదయం లేదా మధ్యాహ్నం వేళ తీసుకుంటారు.. ఈ ప్రత్యేకమైన విత్తనాలు.. బరువును తగ్గించడానికి సహాయపడతాయి.. కానీ చియా గింజలను ఎక్కువగా తినడం ప్రతికూలంగా ఉంటుందని చెబుతున్నారు. చియా గింజలు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కలిగే హాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది: చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా తగ్గిపోతే, ఫలితాలు తారుమారు కావచ్చు. కాబట్టి షుగర్ నియంత్రణకు రెగ్యులర్ ఇన్సులిన్ తీసుకునే వారికి ఈ సీడ్స్ ప్రమాదకరం.

2 / 5
రక్తపోటుపై ప్రభావం: చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కాబట్టి వారు ప్రతిరోజు అధిక రక్తపోటు మందులు వాడాలి. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పల్చగా చేస్తాయి. ఫలితంగా, రక్తపోటు మందుల ప్రభావం నిరోధించబడుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు నిపుణులను సంప్రదించిన తర్వాతే చియా విత్తనాలను తీసుకోవాలి.

3 / 5
జీర్ణ సమస్యలు: చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే అధిక పీచు జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా, కడుపు ఉబ్బడం, గ్యాస్, గుండెల్లో మంట సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
ఆరోగ్యంగా ఉండటానికి చియా విత్తనాలు ఎంత మేర తినాలి?:  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర, రెండు టీస్పూన్ల చియా విత్తనాలు తీసుకోవాలి. ముందుగా.. ఒక చెంచా చియా గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. మీరు చియా గింజలతో పాటు ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు.. సలాడ్‌, స్మూతీస్ తో కలిపి ఈ ప్రత్యేక గింజలను తినవచ్చు. (ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

5 / 5
Follow us