- Telugu News Photo Gallery Drink your way to a glowing skin with the help of these 3 juices Telugu News
చర్మ సమస్యలకు చెక్.. ! ఈ ఒక్క జ్యూస్ చాలు..అందంగా మెరిసిపోతారు..!
మన అందం,ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందన్నది అందరికీ తెలిసినదే. కొంతమంది తమ అందాన్ని పెంచుకోవడానికి రకాల ఫ్రూట్ ఫేషియల్ రకరకాల క్రీములు వాడుతుంటారు. .దానివల్ల ఇతర దుష్ప్రభావాలు కలగడమే కాక ప్రయోజనాలు ఏమీ ఉండక బాధపడుతూ వుంటారు.
Updated on: Jun 15, 2023 | 12:23 PM

అందంగా ఉండాలనే ప్రయత్నంలో చాలా మంది బ్యూటీ పార్లర్ ల వెంట పరుగులు పెడతారు. లేదంటే ఏవైనా ఖరీదైన క్రీములు అవి, ఇవీ రాసేస్తూ ఉంటారు. అయితే, అవేమీ లేకుండా, కేవలం ఒక్క జ్యూస్ తో మనం అందంగా మెరిసిపోవచ్చట. మరి ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం..

మరీ ముఖ్యంగా చాలా మందికి అన్ని పండ్లు, కూరగాయలు తినాలని ఉండదు. అలాంటివారు హ్యాపీగా ఈ జ్యూస్ తాగేయవచ్చు. ఈ జ్యూస్ మీ చర్మాన్ని అందంగా మెరవడానికి సహాయపడుతుంది. మరి ఈ జ్యస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం..

ఈ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు.. ఒక బీట్ రూట్, ఒక ఆరెంజ్, ఒక ఆపిల్, ఒక చిన్న కీర దోస, ఒక టమాట తీసుకోవాలి. అన్నింటినీ కలిసి బ్లెండర్ లో వేసి మెత్తని జ్యూస్ లాగా చేసుకోవాలి. అంతే, జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ ని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోవాలి.

ఈ జ్యూస్ ప్రతిరోజూ తాగడం వల్ల చర్మం అందం మారుతుంది. మీ ముఖం ఎన్నడూ లేనంత కాంతివంతంగా కనపడుతుంది. అయితే, దీనిని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి తాగితే మీకు ఎలాంటి మార్పు కనపడకపోవచ్చు. కానీ, ప్రతిరోజూ తాగడం వల్ల కచ్చితంగా మీరు ఖచ్చితంగా తేడాను గుర్తించారు.

ఇలాంటి పండ్లతో ఫేస్ ప్యాక్ లు చేసుకోవడం వల్ల కూడా అందం,ఆరోగ్యం రెండు లభిస్తాయి.





























