నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. పువ్వులు, మొగ్గలు ఆస్తమా, పిల్లికూతలు, దగ్గును నివారిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ గుణం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. లక్ష్మణ ఫలం చెట్టు బెరడు, పువ్వులు, మొగ్గలు, ఆకులు, పండ్లు ఇలా అన్నిటిలోనూ ఉండే ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిపారు.