Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Manchurian: ఎగ్ మంచూరియా ఇష్టంగా తింటారా.? మీ ఇంట్లోనే టేస్టీరెసిపీ తయారీ..

మంచూరియా చైనా నుంచి భారత్ లోకి అడుగు పెట్టి… మన టేస్ట్ కి అనుగుణంగా రకరకాల రూపాయలను సంతరించుకుంది. వెజ్ మంచూరియా, చికెన్, క్యాబేజీ మంచూరియా, ఎగ్ మంచూరియా ఇలా రకరకాలుగా తయారు చేస్తూనే ఉన్నారు. అసలు మంచూరియాని ఇష్ట పడని వారు బహు అరుదు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేస్తే.. పది నిమిషాల్లో తినేస్తారు. ఎగ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula

| Edited By: Ravi Kiran

Updated on: Jun 09, 2025 | 11:00 PM

కావలసిన పదార్థాలు:  గుడ్లు, కార్న్ ప్లోర్, మైదా, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, వైట్ పెప్పర్ పౌడర్, చైనీస్ చిల్లిపేస్ట్, చక్కర, అజ్నమోటో సొయా సాస్, టమాటో సాస్, వెనిగర్, నీరు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్

1 / 5
ముందుగా కోడి గుడ్లు తీసుకుని ఉడకబెట్టుకోవాలి. అనంతరం పెంకులు తీసి.. గుడ్లను నిలువుగా నాలుగు భాగాలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కోడి గుడ్డుని కొట్టి వేసి.. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

2 / 5
ఇలా మిశ్రం రెడీ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసి వేడి చేసుకోవాలి. రెడీ చేసిన మిశ్రమలో కట్ చేసి పెట్టుకున్న కోడి గుడ్ల ముక్కలను వీసుకుని డిప్ చేయాలి. ఈ కోడి గుడ్డు ముక్కలను నూనెలో వేసి.. ఫ్రై చేసుకోవాలి.  క్రిస్పీగా వేయించిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి.

3 / 5
మళ్ళీ స్టౌ పై ఒక పాన్ పెట్టుకుని వేడి ఎక్కిన తర్వాత కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో చైనీస్ చిల్లి పేస్ట్ , చక్కర, టమాటా కెచప్, మిర్యాల పొడి, అజ్నో మోటో, వైట్ పెప్పర్ పౌడర్, ఉప్పు, వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

4 / 5
తర్వాత కొంచెం సోయా సాస్, టమాటో సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసి.. కావాల్సిన మేర నీరు ఉడికించాలి. అనంతరం ఫ్రై చేసిన గుడ్ల ముక్కలను వేసుకుని బాగా కలపాలి. అనంతరం ఉల్లికాడల ముక్కలు వేసి మిక్స్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ. ఇలాగే తినవచ్చు లేదా టమాటా కచప్ లేదా సిల్లీ సాస్ వేసుకుని తినవచ్చు.

5 / 5
Follow us