AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాడం వచ్చిందంటే చాలు ప్రతి ఆడపిల్లా తన చేతులను అందంగా గోరింటాకుతో ముస్తాబు చేసుకుంటుంది. ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి అమ్మాయి చేయి గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. అంతే కాకుండా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అవి మగువల అందానికి మరింత మెరుగులు దిద్దినట్లు ఉంటుంది. అయితే ఈ ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 01, 2025 | 11:28 PM

Share
ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇక ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది అమ్మాయిల అందాన్ని పెంచడమే కాకుండా, వారికి ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అంతేకాకుండా ఆషాడం మాసంలో గోరింటాకు అనేది పెళ్లికాని అమ్మాయిల ఊహలకు అందాలను అద్దడానికి వచ్చినట్లు ఉంటుందంట. ఎందుంటే ? చాలా మంది అంటుంటారు. గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడని, నిన్ను బాగా చూసుకుంటాడంటూ ఆ ఆడ పిల్ల ఆశలను ఆకాశానికి ఎత్తేస్తారు.

2 / 5
అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు అత్తింటిని విడిచి పుట్టింటికి వస్తారు. అయితే వారు కూడా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అది వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుందంట. పుట్టినింట ఉన్నా.. తన మనసు మెట్టింటి భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. ఈ గోరింటాకు చూసినప్పుడు తన భర్త గుర్తుకు వస్తాడు అంటారు పెద్దవారు.

3 / 5
ఇదే కాకుండా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఇది ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందంట. ఈ మాసంలో వర్షాలు చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా, వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో మహిళలు ఎక్కువగా తడుస్తూ పని చేస్తారు. దీంతో వారు అనేక సమస్యల బారిన పడతారు.

4 / 5
ముఖ్యంగా చర్మ వ్యాధులు వస్తుంటాయి. అయితే వాటి నుంచి రక్షించడానికి గోరింటాకు ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా, ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుందంట. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

5 / 5