AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chef Hat: స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో చెఫ్‌లు పొడవాటి తెల్లని టోపీ ఎందుకు ధరిస్తారో తెలుసా?

స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వంటకాలు తయారు చేసే వారిని చెఫ్స్ అంటారు. చెఫ్‌ కూడా ఓ వృత్తి. ఈ వృత్తికి పాక కళలలో ప్రావీణ్యం చాలా ముఖ్యం. అంతే కాకుండా చెఫ్‌లు పని చేసేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. వాటిలో ఒకటి పొడవాటి తెల్లటి టోపీ ధరించడం. రెస్టారెంట్లలో తెల్లటి టోపీలు ధరించిన చెఫ్‌లను మీరు కూడా చూసి..

Srilakshmi C
|

Updated on: Jun 01, 2025 | 8:54 PM

Share
స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వివిధ వంటకాలు తయారు చేసే వారిని చెఫ్స్ అంటారు. చెఫ్‌ కూడా ఓ వృత్తి. ఈ వృత్తికి పాక కళలలో ప్రావీణ్యం చాలా ముఖ్యం. అంతే కాకుండా చెఫ్‌లు పని చేసేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. వాటిలో ఒకటి పొడవాటి తెల్లటి టోపీ ధరించడం. రెస్టారెంట్లలో తెల్లటి టోపీలు ధరించిన చెఫ్‌లను మీరు కూడా చూసి ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా?

1 / 5
చెఫ్‌లు తలపై తెల్లటి టోపీలు ఎందుకు ధరిస్తారంటే.. చెఫ్‌లు ధరించే తెల్లటి టోపీని పాక కళ చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని ధరించడం కేవలం సంప్రదాయం, ఫ్యాషన్ మాత్రమే కాదు. దీని వెనుక అనేక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. చెఫ్‌లు ధరించే ఈ తెల్ల టోపీని టోక్ లేదా టోక్ బ్లాంచ్ అంటారు. 100 మడతలు కలిగిన టోపీ పాక నైపుణ్యం, అందులో నైపుణ్యాన్ని సూచిస్తుంది. మొత్తం మీద మడతలతో కూడిన ఈ స్థూపాకార టోపీ చెఫ్ వృత్తికి చిహ్నంగా చెప్పవచ్చు.

2 / 5
చెఫ్ టోపీలు అదేనండీ.. టోక్ బ్లాంచ్ ధరించే ఆచారం 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఉద్భవించిందట. సెలబ్రిటీ చెఫ్ మేరీ-ఆంటోయిన్ కారెమ్.. చెఫ్ టోక్, వైట్ చెఫ్ కోటును పరిచయం చేశారు. గతంలో ఫ్రెంచ్ చెఫ్‌లు కాస్క్ ఎ మెచే అనే స్టాకింగ్ క్యాప్‌ను ధరించేవారు. తరువాత వంటగది పరిశుభ్రతకు సంబంధించిన కారణాల దృష్ట్యా తెలుపు రంగును ధరించడం ప్రారంభించారు. ఆ తరువాత చెఫ్‌లు నైపుణ్యం, వృత్తిని సూచించడానికి 18 అంగుళాల తెల్లటి టోపీలను ధరించడం ప్రారంభించారు.

3 / 5
చెఫ్ టోపీ కేవలం సంప్రదాయం, ఫ్యాషన్‌కే పరిమితం కాదు. వంట ప్రక్రియలో భద్రత, పరిశుభ్రతను కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వంటగది పరిశుభ్రత కారణాల వల్ల చెఫ్‌లు ఈ పొడవాటి తెల్లటి టోపీలను ధరిస్తారు. ఇది జుట్టు ఆహారంలోకి పడకుండా నిరోధిస్తుంది. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి వీలు కల్పిస్తుంది. మరోకారణం ఏంటంటే.. ఈ టోపీలు చెమటను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. వంట చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఇది చెమట పట్టడానికి దారితీస్తుంది. అందువల్ల, చెమటను పీల్చుకునే ధోరణిని కలిగి ఉన్న ఈ టోపీలను పరిశుభ్రత కారణాల దృష్ట్యా వంటవారు ధరిస్తారు. ఇది చెఫ్‌లు పనిలో వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణను కొనసాగించడంలో సహాయపడుతుంది.

4 / 5
అయితే నేటి కాలంలో ఈ తెల్లటి టోపీలు గౌరవానికి చిహ్నంగా మిగిలిపోయాయి. కానీ నేడు చెఫ్‌లు వారి పని పరిస్థితులు, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ రకాల హెడ్‌వేర్‌లను ధరిస్తున్నారు. నేటి చెఫ్‌లు టోక్ బ్లాంచ్‌లతోపాటు బెరెట్‌లు, పిల్‌బాక్స్ టోపీలు, బేస్ బాల్ క్యాప్‌లను ధరిస్తున్నారు.

5 / 5