బెల్లంతో లవంగాలు తింటే బోలేడు లాభాలు.. ఆ సమస్యలన్నీ పరార్..!
బెల్లం, లవంగాలను తరచూ మనం తినే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వీటిని కలిపి తీసుకుంటే కూడా అంతే మంచిదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చలికాలంలో తప్పనిసరిగా ఈ కాంబినేషన్ తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 01, 2025 | 5:45 PM

లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందట. జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి.

జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

పీరియడ్స్ సమయంలో బెల్లం, లవంగాలు కలిపి తినటం వల్ల నొప్పి నుంచి, క్రాంప్స్నుంచి ఉపశమనం ఇస్తుంది. లవంగాలను నీళ్లలో వేసి మరిగించాలి. దానిలో బెల్లం వేసుకుని తాగితే మంచిది. లవంగాల పొడి, బెల్లాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కలిపి తాగినా మంచి ప్రయోజనాలు అందుతాయి.

కూరల్లో, సూప్స్‌లో, స్వీట్స్‌లో కూడా వీటి కాంబినేషన్ ట్రై చేసి తీసుకోవచ్చు. లవంగాలు, బెల్లాన్ని పేస్ట్‌గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి. బెల్లం, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ బి, ఎ, సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి.

బెల్లం, లవంగాలను కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. లవంగం, బెల్లం కలిపి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే లవంగం, బెల్లంను కలిపి తీసుకోవాలి. ఇందులోని గుణాలు కడుపు నిండిన భావన కలిగేలా చేస్తాయి.





























