- Telugu News Photo Gallery Do you have a bad smell from wet shoes? If you do this, the smell will go away
తడిచిన షూ నుంచి దుర్వాసన వస్తోందా.? ఇలా చేస్తే స్మెల్ మాయం..
గత కొన్ని రోజులుగా ఎండ దాదాపు కనిపించడం లేదు. దీంతో రోజూ వర్షం నీటిలో, బురదలో నడుచుకుంటూ ఆఫీసుకు, స్కూల్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రంలో షూ-సాక్ తప్పనిసరిగా తడుస్తాయ్. ఒకసారి వర్షంలో తడిసిన షూ-సాక్స్‌లు ఆదిపోయే అవకాశం చాలా వరకు ఉండదు. తడి బూట్లు, సాక్స్ ధరిస్తే.. కాసేపటికే బూట్లు, సాక్స్ దుర్వాసన వస్తాయి..
Updated on: Aug 22, 2025 | 1:40 PM

గత కొన్ని రోజులుగా ఎండ దాదాపు కనిపించడం లేదు. దీంతో రోజూ వర్షం నీటిలో, బురదలో నడుచుకుంటూ ఆఫీసుకు, స్కూల్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రంలో షూ-సాక్ తప్పనిసరిగా తడుస్తాయ్. ఒకసారి వర్షంలో తడిసిన షూ-సాక్స్‌లు ఆదిపోయే అవకాశం చాలా వరకు ఉండదు. తడి బూట్లు, సాక్స్ ధరిస్తే.. కాసేపటికే బూట్లు, సాక్స్ దుర్వాసన వస్తాయి.

బూట్ల వాసన భయంకరంగా ఉంటుంది. దుర్వాసన వచ్చే బూట్లు ధరించకూడదు. దుర్వాసనతో కూడిన షూలు, సాక్స్‌లు వేసుకుంటే చుట్టుపక్కల వారికీ దుర్వాసన వెదజల్లుతుంది. ఎవరూ మీ సమీపంలో నిలబడలేరు. బూట్ల వాసనను ఎలా తొలగించాలంటే.. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు, బూట్లు తీసి పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత షూ లోపల నిమ్మ లేదా నిమ్మ తొక్క ముక్క ఉంచాలి. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కూడా వేస్తే.. వాసనను తొలగిస్తుంది.

ఈ కాలంలో వాటర్ ప్రూఫ్ బూట్లు ధరించడానికి ప్రయత్నించండి. ఉతికడానికి, కడిగి శుభ్రం చేయడానికి వీలుండే బూట్లు ధరించవచ్చు. ఉతికిన బూట్లను సబ్బు నీటిలో కాసేపు నానబెట్టి, తర్వాత బ్రష్‌తో స్క్రబ్ చేయాలి. శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెడితే దుర్వాసన రాదు.

పొడి గుడ్డతో తడి బూట్లు తుడవాలి. బేకింగ్ సోడాను బూట్లలో చల్లాలి. మరుసటి రోజు బూట్లు ధరించే ముందు పూర్తిగా తుడిచి.. ధరించాలి. ఇలా చేస్తే అన్ని వాసనలను తొలగిస్తుంది. బూట్లు వేసుకునే ముందు మీ పాదాలకు బేబీ పౌడర్‌ను పూయాలి. సాక్స్ లోపల కూడా పౌడర్ వేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలకు చెమట తక్కువగా పడుతుంది. చెమట ఉన్నప్పటికీ, పౌడర్ దానిని పీల్చుకుంటుంది, చెడు వాసనను రానివ్వదు.

టీ ట్రీ ఆయిల్ బూట్లు, సాక్స్‌ల నుండి దుర్వాసనను తొలగించడానికి బలేగా పనిచేస్తుంది. షూ మీద కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకోవాలి. సాక్స్‌లను శుభ్రం చేసే సమయంలో టీ ట్రీ ఆయిల్‌ను నీటిలో కలపవచ్చు. దీంతో తడిచిన బూట్లు దుర్వాసన పోయి తాజాగా మారుతాయి.




