- Telugu News Photo Gallery Do these things to keep your body warm during the monsoon season and avoid health problems
వర్షాకాలంలో వెచ్చగా ఉండటానికి ఈ పనులు చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్లే!
వర్షకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు చాలా బద్ధకంగా తయారు అవుతారు. ఏ పని చేయకపోయినా అలసిపోయిన్లు అనిపిస్తుంటుంది. అంతే కాకుండా ఎక్కువగా చలివేసినట్లు ఉండటమే కాకుండా అంత చురుగ్గా ఉండదు. శరీరం ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. దీంతో ఎక్కువ నిద్ర రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో చాలా మంది మైండ్ ఫ్రెష్‌గా ఉండటానికి శరీరం వేడిగా ఉంచుకోవడానికి ఎక్కువ టీ, కాఫీలు తాగుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా అని? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 16, 2025 | 1:03 PM

వర్షకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం కోసం మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే తర్వాత పెద్ద సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టీ, కాఫీలు, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం, ఎక్కువ సేపు పడుకోవడం అనేది అస్సలే మంచిది కాదంట. కాగా, ఇప్పుడు అసలు ఎలాంటి అలవాట్లు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయో చూద్దాం.

కాఫీ, టీ అధికంగా తీసుకోవడం: వర్షం వల్ల కలిగే చలిని వదిలించుకోవడానికి, కొంతమంది ఉదయం లేవగానే టీ తాగుతుంటారు, అంతే కాకుండా తమకు చలి ఎక్కువగా అనిపిస్తే మధ్యాహ్నం, సాయంత్రం కాఫీ లేదా టీ తాగుతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వీటిల్లో ఉండే కెఫిన్ శక్తిని ఇస్తుంది, కానీ అది ఎక్కువగా తీసుకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. అనేక సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుందంట.

వేడినీటి స్నానం చేయడం: వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా వేడిగా ఉండే వేడినీటితో స్నానం చేయడం చేస్తారు చాలా మంది. కానీ పరిశోధన ప్రకారం ఈ నీటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉండాలంట. దీని కంటే ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు రావడమే కాకుండా చర్మం దెబ్బ తినే ఛాన్స్ ఉంటుందంట. చాలా వేడి నీరు చర్మ కణజాలాలను దెబ్బతీస్తుంది. చర్మం ముడతలు అవకాశం ఎక్కువగా ఉందంట.

అధిక నిద్ర: వర్షాకాలంలో చాలా మంది వెచ్చగా ఉంటుందని ఎక్కువ సేపు పడుకుంటారు. అసలు టైమ్ తెలియకుండా ని్రపోతారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? దీని వలన శరీరానికి సరిపడ ఫుడ్ తినకపోవడం, లేచిన తర్వాత నీరసంగా అనిపించడం, కొన్ని సార్లు అధిక నిద్ర బరువు పెరిగేలా కూడా చేస్తుందంట.

నీరు తాగకపోవడం: వర్షాకాలంలో చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉన్నదా అంటే అది సరిగ్గా నీరు తాగకపోవడం. వాతావరణం చల్లగా ఉండటం తో ఎక్కువగా మంచినీరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఇలా చేయడం శరీరానికి మంచిది కాదు. దీని కారణంగా, శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇది మూత్రపిండాలు,జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుందింట.



