- Telugu News Photo Gallery Dark Elbows: How To Lighten Dark Elbows Naturally? Follow These 5 Home Remedies
Dark Elbows: ఇలా చేస్తే 7 రోజుల్లోనే మోచేతులపై నల్లని మచ్చలు పోతాయ్..
ముఖంపై మొటిమల మచ్చల మాదిరిగానే మోచేతులపై నల్ల మచ్చలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. మోచేతి భాగంలో మృతకణాల పొర పేరుకుపోయి మోచేతిని నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా ఆ భాగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సన్‌స్క్రీన్ రాసుకోకపోవడం వల్ల కూడా మోచేతులపై నల్ల మచ్చలు ఏర్పడతాయి..
Updated on: Jun 04, 2024 | 9:16 PM

ముఖంపై మొటిమల మచ్చల మాదిరిగానే మోచేతులపై నల్ల మచ్చలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. మోచేతి భాగంలో మృతకణాల పొర పేరుకుపోయి మోచేతిని నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా ఆ భాగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సన్‌స్క్రీన్ రాసుకోకపోవడం వల్ల కూడా మోచేతులపై నల్ల మచ్చలు ఏర్పడతాయి.

మోచేతులపై ఉన్న ఈ నల్లని మచ్చలను పోగొట్టడానికి ఎలాంటి క్రీమ్ అవసరం లేకుండా ఇంటి నివారణల సహాయంతో సులంగా వదిలించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెడ, మోకాళ్లపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.

నిమ్మతొక్కను గ్రైండ్ చేసి అందులో తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రుద్దుకోవాలి. దీనిని 2-3 నిమిషాలు రుద్ది, ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా 7 రోజులు ఈ ట్రిక్ ఉపయోగిస్తే తేడా మీకే కనిపిస్తుంది

అలాగే రోజూ మోచేతులపై అలోవెరా జెల్‌ను అప్లై చేసినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్‌తో కాఫీ మిక్స్ చేసి మోచేతులపై అప్లై చేయాలి. ఈ ట్రిక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మోచేతులపై ఉన్న నల్ల మచ్చలు ఇట్టే పోతాయి. ప్రతిరోజూ స్నానానికి ముందు టమోటాలను మోచేతులపై రుద్దాలి. టొమాటోలో టాన్ తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణం ఉంటుంది. కావాలంటే టొమాటోలో పసుపు కూడా కలుపుకోవచ్చు.

నల్ల మచ్చలను తొలగించడంలో పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పచ్చి పాలలో పసుపు పొడిని కలిపి మోచేతులకు పట్టించాలి. ఆరిన తర్వాత స్క్రబ్ చేసి కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది. ఎలాంటి మచ్చలను తొలగించడంలో అయినా కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. రెండు చుక్కల కొబ్బరి నూనెను మోచేతులపై రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. దీనిలోని విటమిన్ ఇ చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది.



















