- Telugu News Photo Gallery Dangers of Lending Credit Cards to Friends: Financial Risks and Tax Scrutiny
Credit Cards: ఫ్రెండ్స్‌కు క్రెడిట్ కార్డు ఇస్తున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే తిప్పలు తప్పవు..
మనలో చాలా మందికి క్రెడిట్ కార్డు యూజ్ చేసే అలవాటు ఉంటుంది. దీన్ని చాలా వరకు ఎమర్జెన్సీ అవసరాల కోసం వినియోగిస్తాం. కొన్ని సార్లు మన ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉందంటే వాళ్లకు కూడా క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటాం.. దానితో వాళ్లు షాపింగ్స్ చేస్తుంటారు. ఇలా తరుచుగా మీరు మీ క్రెడిట్ కార్డ్సును ఫ్రెండ్స్ ఇవ్వడం వల్ల భవిషత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవెంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Sep 27, 2025 | 5:06 PM

మీ స్నేహితులకు క్రెడిట్ కార్డులు ఇచ్చే అలవాటు మీకు కూడా ఉందా? దానితో వాళ్లు భారీ మొత్తంలో షాపింగ్ చేసి మళ్లీ మీకు తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారా? కొన్ని సార్లు చెల్లించకపోవచ్చు. దీని కారణంగా మీరు భవిషత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీరు క్రెడిట్ కార్డు ఇచ్చేది ఒక అలవాటుగా మారితే తలెత్తే ప్రమాదాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా క్రెడిట్ కార్డులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీపై ఛార్జీలు విధించబడవచ్చు. తరచుగా పెద్ద కొనుగోళ్లు చేయడం వల్ల మీరు ప్రమాదంలో పడవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక యూజర్ రూ.10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డ్ ఖర్చుల చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అందజేస్తాయి. వారు మీ ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తారు. రూ. లక్షకు పైగా నగదు రూపంలో కార్డ్ బిల్లులు చెల్లిస్తున్న ఎవరైనా ఖచ్చితంగా ఈ పరిశీలనలోకి వస్తారు.

ఇదే కాకుండా EMIలు చెల్లించడానికి మీ అకౌంట్‌లోకి భారీగా అమౌంట్‌ను యాడ్ చేసుకుంటే మీరు దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ డబ్బు వేరొకరిదని నిరూపించగలిగినప్పటికీ, కొన్ని సార్లు వివరణ ఇవ్వక తప్పదు.

అలాగే మీరు దర్యాప్తుకు సహకరించి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి UPI, NEFT, IMPS వంటి ట్రాక్ చేయగల బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా లావాదేవీలు చేయడం సురక్షితం. క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించడానికి డబ్బు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోండి. (NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం నివేదిక, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించడం జరిగింది. కాబట్టి ఈ అంశాలపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధితన నిపుణులను సంప్రదించండి.)




