- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli and his RCB teammates visit Mohammed Siraj's house in Hyderabad ahead of SRH clash
Photo Gallery: మహమ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేసిన విరాట్ కోహ్లీ, ఆర్సీబీ టీమ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు తోటి ఆటగాడు మహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో సిరాజ్ కొత్తగా కట్టుకున్న ఇంటిని సందర్శించారు.
Updated on: May 17, 2023 | 1:17 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్ ఇంట్లో సందడి చేశారు. హైదరాబాద్‌లో అతడు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని సందర్శించారు.ఆర్సీబీ మాడీ కెప్టెన్ విరాట్ కోహ్లి, డుప్లెసిస్, కేదార్ జాదవ్, పార్నెల్‌లతో పాటు పలువురు జట్టు సభ్యులు అతని ఇంటికి వచ్చారు.

కొన్ని గంటల పాటు అక్కడే గడిపారు. అయితే జూబ్లీ హిల్స్ ఫిల్మ్‌నగర్లో మహ్మద్ సిరాజ్ కుటుంబం ఈ మధ్యే కొత్త ఇంటిని నిర్మించుకుంది. గతంలో వారు పాతబస్తీలో ఉండేవారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీమ్‌ఇండియాకు ఆడుతుండటంతో సిరాజ్ రాత మారింది. సంపాదన కూడా పెరిగింది. దాంతో కుటుంబం కోసం కొత్త ఇల్లు కట్టించాడు సిరాజ్.

సిరాజ్ కొత్త ఇంటి డ్రాయింగ్ రూమ్ చాలా అందంగా అలంకరించారు. ట్రోఫీలు సోఫా సెట్ వెనుక పేర్చబడి ఉన్నాయి. విరాట్‌తో ఉన్న చిత్రం గోడపై వేలాడదీసి ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించడం ద్వారా 2023 IPLలో ప్లేఆఫ్‌ల ఆశలను సజీవంగా ఉంచుకుంది

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం తన చివరి రెండో లీగ్ మ్యాచును ఆడనుంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే నగరానికి వచ్చేసింది. పనిలో పనిగా లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ ఇంటికి విచ్చేసింది.

సిరాజ్ కుటుంబ సభ్యులతో విరాట్ కోహ్లీ దిగిన ఫొటో




