- Telugu News Photo Gallery Cricket photos Vaibhav Suryavanshi 32 Balls Century Put Chris Gayle Record In Danger In T20 Cricket
Vaibhav Suryavanshi: బుడ్డోడా మజాకానా.! 32 బంతుల్లోనే ముచ్చెమటలు.. కోహ్లీ ఫ్రెండ్‌కే దడ పుట్టించాడుగా
బుడ్డోడు.. బుడ్డోడు అంటే.. గుడ్డలు ఊడదీసి కొడతా.. ఈ ఎన్టీఆర్ డైలాగ్ మీరు వినే ఉంటారు. సరిగ్గా దీనికి తగ్గట్టుగా నిన్న దోహాలో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ ఇన్నింగ్స్ పై ఓ లుక్కేయండి మరి.
Updated on: Nov 15, 2025 | 11:36 AM

దోహాలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతోంది. నిన్న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసి.. భారత క్రికెట్‌లో తన పేరిట మరో రికార్డు నెలకొల్పాడు.

శనివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఈ లిస్టులో ఇప్పటికే 28 బంతుల్లో సెంచరీ చేసి.. ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచారు.

ఇక బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ గురించి చూస్తే.. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నాడు. అలాగే కేవలం 17 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సైతం పూర్తీ చేశాడు. ఆ తర్వాత మరో 15 బంతుల్లోనే తన సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి అవుట్ అయ్యాడు వైభవ్. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. ఒకానొక సమయంలో 200 పరుగులు వైభవ్‌కు సాధ్యం అని అందరూ భావించగా.. చివరికి పెవిలియన్ చేరాడు.

ఇక వైభవ్ ఈ ఇన్నింగ్స్‌తో ఏకంగా కోహ్లి ఫ్రెండ్‌కే దడ పుట్టించేలా చేశాడు. అతడు మరెవరో కాదు.. క్రిస్ గేల్.! టీ20ల్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 175 పరుగులు చేశాడు. కొంచెం ఉంటే ఈ రికార్డు వైభవ్ పేరిట నమోదయ్యేది.




