- Telugu News Photo Gallery Cricket photos Top 5 Young Players Outstanding Performance In IPL 2023, Rinku Singh, Tilak Varma In List
IPL 2023: ఐపీఎల్ ఆణిముత్యాలు.. సైలెంట్‌గా వచ్చి చీల్చి చెండాడుతున్నారు.. లిస్టులో హైదరాబాదీ..
ఐపీఎల్ ఎంతోమంది యువ ప్లేయర్ల జీవితాలను మార్చేస్తుంది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌లుగా మారిపోతారు. ప్రతీ సీజన్‌లోనూ ఒకరిద్దరు ప్లేయర్లు.. ఇలానే సత్తా చాటుతూ.. టీమిండియా జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. మరి ఈ సీజన్‌లో ఆ ప్లేయర్స్ ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Apr 18, 2023 | 4:01 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకు సింగ్.. ఈ సీజన్‌లో ఎంతటి విధ్వంసం సృస్తిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే.. చివరి వరకు సాధ్యం కానీ టార్గెట్‌ను.. వరుస 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదేసి.. కేకేఆర్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మ్యాచ్‌లలోనూ ఇదే ఆటతీరును రింకు కొనసాగించాడు. 5 మ్యాచ్‌ల్లో 174 పరుగులు చేసిన అతడు.. ఇదే గేమ్ కొనసాగిస్తే.. టీమిండియా ఫినిషర్ కావడం ఖాయం.

గుజరాత్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ గతేడాది నుంచి చక్కటి ఆటతీరును కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్న ఈ 21 ఏళ్ల యువ ప్లేయర్.. గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆ జట్టుకు గిల్ తర్వాత అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటికే 5 మ్యాచ్‌లలో 176 పరుగులు చేశాడు.

ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఐపీఎల్ 2023ను తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రారంభించిన విషయం తెలిసిందే. అతడు బెంగళూరుపై 84 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 20 ఏళ్ల తిలక్ వర్మ హైదరాబాద్ తరపున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక ఇప్పుడు ముంబైకు కీలక బ్యాటర్‌గా మారాడు.

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ మీద ఉన్నాడు. ధోని సారధ్యంలో తన ఆటతీరును పూర్తిగా మెరుగుపరుచుకుని.. అద్భుతమైన షాట్స్‌తో సీఎస్‌కే ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో 200 పరుగులు సాధించాడు. ఇదే ఫామ్ కొనసాగితే.. కచ్చితంగా టీమిండియాలో స్పాట్ పక్కా..

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. 16.50 యావరేజ్‌తో 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు.




