మరోవైపు గ్రూప్-డిలో ఉన్న శ్రీలంక ప్రపంచకప్ ప్రచారానికి కూడా తదుపరి మ్యాచ్‌తో తెరపడనుంది. లంక జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 ఓడిపోయింది. అలాగే, నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేవలం 1 పాయింట్ మాత్రమే లభించింది. తలా 2 పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తదుపరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, శ్రీలంక టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమిస్తుంది.