- Telugu News Photo Gallery Cricket photos South Africa vs Pakistan Abdullah Shafique becomes first opener in history to have 3 consecutive ducks in ODI series
ODI Records: పాకిస్తాన్ బ్యాటర్‌తో అట్లుంటది మరి.. కట్‌చేస్తే.. క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
Abdullah Shafique: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంలో పాక్ ఆటగాడు అబ్దుల్లా షఫీక్ సహకారం జీరో కావడం విశేషం. అంటే అబ్దుల్లా మూడు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో తన పేరిట ఓ చెత్త రికార్డ్ నెలకొల్పాడు.
Updated on: Dec 23, 2024 | 11:32 AM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాక్ పేసర్ అబ్దుల్లా షఫీక్ అవాంఛనీయ రికార్డు సృష్టించాడు. అది కూడా 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని పేలవమైన రికార్డును లిఖించడం విశేషం.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సున్నాకే ఔటైన అబ్దుల్లా షఫీక్ రెండో మ్యాచ్‌లోనూ జీరోకే వికెట్ పోగొట్టుకున్నాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో కగిసో రబడా చేతికి చిక్కి సున్నాకే ఔటయ్యాడు.

ఈ మూడు వికెట్లతో వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ జీరోకే పెవిలియన్ చేరిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా అబ్దుల్లా షఫీక్ నిలిచాడు. ఇలా చేయడం ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు సృష్టించాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీ20 క్రికెట్‌లోనూ ఈ పేలవమైన రికార్డును అబ్దుల్లా షఫీక్ పేరిట చేరడం గమనార్హం. 2023లో వరుసగా 4సార్లు జీరోకే పెవిలియన్ చేరి ఈ అవాంఛిత రికార్డును లిఖించాడు.

ఈ పేలవమైన రికార్డుతో, అబ్దుల్లా షఫీక్ ఇప్పుడు ODI సిరీస్‌లో వరుసగా జీరో పరుగులకే పెవిలియన్ చేరిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా అపఖ్యాతి పొందాడు. అందుకే పాకిస్థాన్ ఆటగాడిని డక్‌మన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.




