- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma Shahid Afridi Including Three Batters Most Sixes ODI Format
Rohit Sharma: ప్రపంచ రికార్డ్ సృష్టించే అవకాశం.. ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకు రోహిత్ రెడీ.. ఎప్పుడో తెలుసా?
Most Sixes in ODIs: రోహిత్ శర్మ మొదటి నుంచి భారీ హిట్‌లు కొట్టడంలో నిపుణుడిగా పేరుగాంచాడు. అయితే, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కానీ, రోహిత్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సిందే, ఎందుకంటే 2024లో భారత జట్టు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఇకపై ఆడదు.
Updated on: Aug 09, 2024 | 6:24 PM

Most Sixes in ODIs: క్రికెట్ ఆట ప్రస్తుతం చాలా మారిపోయింది. టెస్టుల్లోనూ 500 స్కోరు కష్టంగా అనిపించినా.. ఇప్పుడు కొన్ని జట్లు కేవలం ఒకటి లేదా ఒకటిన్నర రోజుల్లోనే 500 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నాయి. అదే సమయంలో వన్డే ఫార్మాట్‌లో ఆడే శైలి కూడా మారిపోయి ఇప్పుడు 300 స్కోరును కూడా సాధించడం సులువుగా మారింది. దీనికి అతిపెద్ద కారణం బ్యాట్స్‌మెన్ భారీ హిట్స్ ఆడగల సామర్థ్యం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్స్ సిక్సర్లు కొట్టడంలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ అయిన భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా ఇందులో ఉంది.

రోహిత్ శర్మ మొదటి నుంచి భారీ హిట్‌లు కొట్టడంలో నిపుణుడిగా పేరుగాంచాడు. అయితే, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కానీ, రోహిత్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సిందే, ఎందుకంటే 2024లో భారత జట్టు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఇకపై ఆడదు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత సాధించిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ తన ODI కెరీర్‌ను 2007లో ప్రారంభించాడు. అయితే, 2012 తర్వాత ఈ ఫార్మాట్‌లో అతనికి నిజమైన గుర్తింపు వచ్చింది. ఓపెనర్‌గా అవకాశం లభించినప్పుడు, హిట్‌మ్యాన్ దానిని అద్భుతంగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరిట మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదే సమయంలో, రోహిత్ ఇప్పటివరకు 265 మ్యాచ్‌లలో 331 సిక్సర్లు కొట్టాడు.

2. క్రిస్ గేల్: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరు వినగానే అందరికి అతని తుఫాన్ బ్యాటింగ్, భారీ సిక్సర్లు గుర్తుకు వస్తాయి. వెస్టిండీస్ తరపున ఆడుతున్నప్పుడు గేల్ తన కెరీర్‌లో మొత్తం 301 ODIలు ఆడాడు. ఈ కాలంలో అతను 331 సిక్సర్లు కొట్టాడు. అతని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో తలపడినప్పుడు గేల్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

1. షాహిద్ అఫ్రిది: పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా సిక్సర్లు కొట్టడంలో ఫేమస్. అఫ్రిది తన వికెట్ గురించి పట్టించుకోకుండా తొలి బంతి నుంచే భారీ హిట్ కొట్టేందుకు ప్రయత్నించేవాడు. అతను తన ODI కెరీర్‌లో 398 మ్యాచ్‌లలో 351 సిక్సర్లు కొట్టాడు. ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డు. అయితే, వచ్చే ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌లో, ఆపై ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్రిది రికార్డును బద్దలు కొట్టి టాప్ పొజిషన్‌ను సాధించే అవకాశం రోహిత్‌కి ఉంది.




