- Telugu News Photo Gallery Cricket photos PSL 2022: Will Smeed and Ahsan Ali slam hit 155 runs opening stand for quetta gladiators vs Peshawar Zalmi in Pakistan Super League 2022
29 ఫోర్లు, 7 సిక్సులు.. బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు.. ఇదేం బ్యాటింగ్ రా బాబోయ్ అంటోన్న నెటిజన్లు
PSL:క్వెట్టా గ్లాడియేటర్స్‌కు చెందిన ఓపెనింగ్ జోడీ పెషావర్ బౌలర్లను చిత్తు చేసింది. అయితే వీరిలో ఒకరు సెంచరీకి కొద్ది దూరంలో అంటే 97 పరుగుల వద్ద ఔటయ్యారు.
Updated on: Jan 29, 2022 | 7:45 AM

PSL 2022: పాకిస్థాన్ నంబర్ వన్ టీ20 టోర్నీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఉత్కంఠంగా ప్రారంభం కాగా, రెండో రోజు టోర్నీలో సందడి నెలకొంది. కరాచీలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో, క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ శుక్రవారం, జనవరి 28న తలపడ్డాయి. ఇందులో క్వెట్టా బ్యాట్స్‌మెన్ తుఫాన్ సృష్టించారు. ఓపెనింగ్ జోడీ ఎహ్సాన్ అలీ, విల్ స్మెడ్ జోడీ జట్టుకు భారీ స్కోరు అందించారు. (ఫోటో: PSL)

కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత క్వెట్టా బ్యాటింగ్‌కు దిగిన ఓపెనింగ్ జోడీ పాకిస్థాన్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు జట్టుకు తుఫాను లాంటి ఆరంభం అందించారు. ఇద్దరి బ్యాట్‌లు చాలా వేగంగా పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు కేవలం 15.3 ఓవర్లలోనే 155 పరుగుల తుఫాను భాగస్వామ్యం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి 26 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. (ఫోటో: PSL)

ఇందులో 20 ఏళ్ల స్మెడ్ ధీటుగా బ్యాటింగ్ చేశాడు. కానీ, సెంచరీ మిస్సయ్యాడు. 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు సాధించాడు. అదే సమయంలో ఎహసాన్ కూడా వెనుకంజ వేయలేదు. ఈ బ్యాట్స్‌మన్ కేవలం 46 బంతుల్లో 76 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. (ఫోటో: PSL)

వీరిద్దరి ఇన్నింగ్స్ ఆధారంగా క్వెట్టా కేవలం 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. పెషావర్ బౌలర్లందరూ చెలరేగిపోయారు. లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ మాత్రమే ప్రభావం చూపగలిగాడు. 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. (ఫోటో: PSL)




