- Telugu News Photo Gallery Cricket photos Pakistan wicket keeper Mohammad Rizwan Leading in Most Fours list in T20 World Cup 2021, see Full details
T20 World Cup 2021: బౌండరీలు బాదడంలో వీరి రూటే సపరేటు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
టీ20 ప్రపంచకప్ 7వ సీజన్ ఉత్కంఠగా కొనసాగుతోంది. యూఏఈలోని పిచ్‌లపై ఐసీసీ టోర్నమెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. 12 జట్ల మధ్య పోరు జరుగుతోంది.
Updated on: Oct 29, 2021 | 4:11 PM

టీ20 ప్రపంచకప్ 7వ సీజన్ ఉత్కంఠగా కొనసాగుతోంది. యూఏఈలోని పిచ్‌లపై ఐసీసీ టోర్నమెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. 12 జట్ల మధ్య పోరు జరుగుతోంది. అయితే ఈ పోటీల్లో బౌండరీల పోటీని తీసుకుంటే ఇందులో ప్రస్తుతం 4 దేశాల బ్యాట్స్‌మెన్లు ఒకరికొకరు గట్టి పోటీ పడుతున్నారు. అయితే చివరికి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ అగ్రస్థానం ఆక్రమించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధిస్తోంది. అత్యధిక ఫోర్లలో దూసుకుపోతున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన వారిలో నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఉన్నారు. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్‌లు నాలుగు దేశాలకు చెందిన వారు. ఇందులో శ్రీలంకకు చెందిన రాజపక్సే, ఓమన్‌కు చెందిన జతీందర్ సింగ్, స్కాట్లాండ్‌కు చెందిన మున్సే, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు టోర్నీలో తలో 11 ఫోర్లు కొట్టారు. అయితే వీరు ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే పాకిస్తాన్‌కు చెందిన రిజ్వాన్‌దే పైచేయి అని తెలుస్తుంది.

పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 2 మ్యాచ్‌ల్లో 11 ఫోర్లు సాధించాడు. ఈ కోణంలో చూస్తే అత్యధిక ఫోర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. దీని తర్వాత ఒమన్‌కు చెందిన జతీందర్ సింగ్ 11 ఫోర్లు సాధించడానికి 3 మ్యాచ్‌లు తీసుకున్నాడు. కాగా, స్కాట్లాండ్‌కు చెందిన మున్సే, శ్రీలంకకు చెందిన రాజపక్సే 5 మ్యాచ్‌ల్లో 11 ఫోర్లు సాధించారు.

వీరి తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక, అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నిలిచాడు. 3 మ్యాచ్‌ల్లో 10 ఫోర్లు కొట్టాడు. అతని తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్ 5 మ్యాచ్‌లు ఆడి 10 ఫోర్లు సాధించాడు.




