- Telugu News Photo Gallery Cricket photos Mohammed Siraj and Nikhat Zareen awarded Group 1 jobs with 600 square yards plots in Hyderabad says Telangana CM Revanth reddy
Telangana: మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్‌లకు గ్రూప్ 1 ఉద్యోగాలు, 600 గజాల ప్లాట్స్: అసెంబ్లీలో సీఎం రేవంత్
Mohammed Siraj, Nikhat Zareen: మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ హైదరాబాద్‌లో గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ప్లాట్‌ను ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. షూటర్ ఈషా సింగ్, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయించనుంది.
Updated on: Aug 02, 2024 | 12:50 PM

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ హైదరాబాద్‌లో గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ప్లాట్‌ను ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. షూటర్ ఈషా సింగ్, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయించనుంది.

మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్‌లకు ఆయా రంగాలలో సహకారంపై ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాలను కూడా అందించింది. జులై 31, గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రకటన చేసింది.

భారత క్రికెట్ జట్టులో భాగంగా టీ20 ప్రపంచ కప్ విజయానికి సిరాజ్ అందించిన సహకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిరాజ్ సాధించిన విజయాలను సీఎం కొనియాడారు. సిరాజ్ తన ప్రదర్శనల ద్వారా రాష్ట్రానికి, దేశానికి గొప్ప పెరు తెచ్చాడని ఉద్ఘాటించారు.

సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇస్తుందని, పోలీసు శాఖలో చేరాలని ఎంచుకుంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ) వంటి అత్యున్నత ర్యాంక్‌లలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తుందని ఆయన ప్రకటించారు.

బాక్సర్ నిఖత్ జరీన్ 2022, 2023లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను గెలుచుకోవడంతో సహా అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఆమెను నియమించడంలో మునుపటి BRS ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ విమర్శించారు.




