- Telugu News Photo Gallery Cricket photos Mi vs gt netizens fire on surya kumar yadav man of the match award over rashid khan
IPL 2023: సూర్య కంటే రషీద్ ఖానే తోపు ప్లేయర్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకుండా అవమానిస్తారా.. నెటిజన్ల ఫైర్..
IPL 2023: 360 డిగ్రీలలో బ్యాట్‌ను ఝుళిపించిన సూర్యకుమార్ యాదవ్ 6 భారీ సిక్సర్లు, 11 ఫోర్లు బాదాడు. ఫలితంగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 49 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Updated on: May 13, 2023 | 6:43 PM

IPL 2023: ఐపీఎల్ 57వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) జట్టుకు తుఫాన్ ఆరంభాన్ని అందించారు.

ముంబై ఇండియన్స్ స్కోరు 61 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఈ సమయంలో 3వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన సూర్య తన ప్రతాపం చూపించాడు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ బౌలర్లు లయ కోల్పోయారు.

360 డిగ్రీల్లో బ్యాట్‌ను ఝుళిపించిన సూర్యకుమార్ యాదవ్.. 6 భారీ సిక్సర్లు, 11 ఫోర్లు బాదాడు. ఫలితంగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 49 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో పాటు జట్టు స్కోరును 5 వికెట్ల నష్టానికి 218కి చేర్చాడు.

219 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 26 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అయితే డేవిడ్ మిల్లర్ 41 పరుగుల సాయంతో గుజరాత్ జట్టు 12 ఓవర్లలో 100 పరుగులు చేసింది.

8వ స్థానంలో వచ్చిన రషీద్ ఖాన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. ముంబయి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఒక్క క్షణం విజయ కాంక్షను గుజరాత్ శిబిరంలో నెలకొల్పాడు. అలాగే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఓటమి భయం సృష్టించగలిగాడు.

ముఖ్యంగా డెత్ ఓవర్లలో భీకర బ్యాటింగ్ ప్రదర్శించిన రషీద్ ఖాన్ 32 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 79 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ ఒంటరి పోరాటం చేసినా గుజరాత్ టైటాన్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రషీద్ ఖాన్‌కు దక్కాల్సి ఉందన్న వాదనను సోషల్ మీడియాలో పలువురు ముందుకు తెచ్చారు.

గెలిచిన జట్టులోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలనే నియమం లేదు. గతంలోనూ అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే సూర్యకుమార్ కంటే రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హుడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎందుకంటే ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయినా.. రషీద్ ఖాన్ బౌలింగ్ లో మెరిశాడు. 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా 79 పరుగులు చేశాడు.

ఈ రెండు ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కంటే రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హుడయ్యాడు. అయితే సెంచరీ చేసిన ఆటగాడిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




