- Telugu News Photo Gallery Cricket photos India squad for west indies tour bcci select 10 bowlers telugu news
IND vs WI: నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్ రౌండర్లు.. 6 నెలల్లో టీమిండియా ఫ్యూచర్ మార్చేది వీరేనా?
India Squad For West Indies tour: వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విశేషమేమిటంటే వన్డే సిరీస్‌కు ఎంపికైన 17 మందిలో ఆల్‌రౌండర్‌తో సహా మొత్తం 10 మంది బౌలర్లు కనిపిస్తున్నారు.
Updated on: Jun 25, 2023 | 11:11 AM

India vs West Indies: వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విశేషమేమిటంటే వన్డే సిరీస్‌కు ఎంపికైన 17 మందిలో ఆల్‌రౌండర్‌తో సహా మొత్తం 10 మంది బౌలర్లు కనిపిస్తున్నారు.

రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ బ్యాట్స్‌మెన్స్‌గా ఎంపికయ్యారు. అలాగే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్స్‌గా ఎంపికయ్యారు.

అలాగే, ఆల్‌రౌండర్ల జాబితాలో 4గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు.

ఇక బౌలర్ల జాబితాలో మొత్తం 6గురికి చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ పేసర్లుగా ఇక్కడ కనిపించనున్నారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ కూడా జట్టులో చేరారు.

అంటే 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో 10 మంది ఆటగాళ్లు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలరు. దీని ప్రకారం మొత్తం 6గురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.

ఇక్కడ హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్ పేసర్లుగా ఎంపికయ్యారు. అలాగే స్పిన్నర్ల స్థానంలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

ఈసారి ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్‌రౌండర్లతో సహా మరికొంత మంది బౌలర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. అలాగే వారిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్లను ఆసియా కప్‌నకు ఎంపిక చేస్తారు.





























