- Telugu News Photo Gallery Cricket photos IND vs WI: Indian Cricket Team to become 1st team to play 1000 ODI matches
IND vs WI: అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా స్పెషల్ రికార్డు.. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌లకూ సాధ్యం కాలే.. అదేంటంటే?
Indian Cricket Team: వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు చేరుకోని ఓ రికార్డుకు టీమిండియా చేరువైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రోహిత్ సేన ఈ స్పెషల్ రికార్డు సృష్టించనుంది.
Updated on: Jan 30, 2022 | 9:20 AM

India Vs West Indies: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారత్ వర్సెస్ వెస్టిండీస్‌ల మ్యాచ్‌లలో ఎన్నో రికార్డులు ఏర్పడ్డాయి. ఈసారి కూడా మరెన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ సిరీస్ నిలవనుంది. బ్యాట్, బాల్ పోటీపడే ఈ సిరీస్‌లో టీమిండియా పేరిట ఓ ప్రపంచ రికార్డు నెలకొని ఉంటుంది. ఇప్పటి వరకు ఏ జట్టుకు ఇలాంటి రికార్డు నెలకొల్పలేదు. (ఫోటో: BCCI)

ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో మ్యాచ్ భారత జట్టు ఎంతో ప్రత్యేకమైంది. వన్డేల్లో టీమిండియా ఆడబోయే 1000వ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ భారత్ క్రికెట్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే ఈ స్థాయికి చేరుకున్న తొలి క్రికెట్ జట్టుగా టీమ్ ఇండియా రికార్డు సృష్టించనుంది. (ఫోటో: BCCI)

భారత జట్టు తన మొదటి వన్డే మ్యాచ్‌ని 13 జూలై 1974న లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో ఆడింది. దీనిలో జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 999 వన్డేలు ఆడింది. భారత జట్టు 518 మ్యాచులు గెలిచింది. అలాగే 431 మ్యాచుల్లో ఓడిపోయింది. అత్యధిక విజయాల విషయంలో ఆస్ట్రేలియా (581) తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక ఓటములతో శ్రీలంక (432) తొలి స్థానంలో ఉంది. (ఫోటో: BCCI)

భారత్‌తో పాటు రెండు జట్లు మాత్రమే 900కు పైగా వన్డేలు ఆడాయి. 1971లో ఇంగ్లండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు 958 మ్యాచ్‌లు ఆడగా, అందులో 581 విజయాలు, 334 ఓటములు చవిచూసింది. అదే సమయంలో, పాకిస్థాన్ 936 మ్యాచ్‌లు ఆడగా, అందులో 490 గెలిచింది, 417 ఓడిపోయింది. (ఫైల్ ఫోటో)




