- Telugu News Photo Gallery Cricket photos Ind vs ban team india captain rohit sharma 2nd place in highest sixes in international cricket
Rohit Sharma Records: గాయం ఇబ్బంది పెట్టినా.. తుఫాను బ్యాటింగ్‌తో స్పెషల్ రికార్డ్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్..
Rohit Sharma: రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా భారత కెప్టెన్ నిలిచాడు.
Updated on: Dec 08, 2022 | 5:30 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కెప్టెన్ 28 బంతుల్లో అజేయంగా 51 పరుగులతో నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

అయితే భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఈ మ్యాచ్‌లో కడవరకు పోరాడిన రోహిత్ శర్మ.. తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్ 500 సిక్సర్లు పూర్తి చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 428 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 502 సిక్సర్లు బాదాడు.

భారత కెప్టెన్ కంటే క్రిస్ గేల్ ముందున్నాడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో నిలిచాడు. షాహిద్ అఫ్రిది 508 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు కొట్టాడు.

అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ 474 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 398 సిక్సర్లు కొట్టాడు.

ఇక న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 402 మ్యాచ్‌ల్లో 383 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.




