- Telugu News Photo Gallery Cricket photos IND Vs AFG 1st T20 Team India Captain Rohit Sharma Became Oldest Captain For India In T20is
IND vs AFG: రీఎంట్రీలో ఆఫ్ఘనిస్థాన్‌పై జీరో.. కట్‌చేస్తే.. రెండు రికార్డుల్లో చేరిన రోహిత్ శర్మ..!
IND vs AFG: ఈ మ్యాచ్‌లో, కెప్టెన్ రోహిత్ సున్నాకి ఔటయ్యాడు. తన పేరిట అరుదైన రికార్డును సృష్టించాడు. అలాగే, ఒక విషయంలో గతంలో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లందరినీ అధిగమించాడు. ఈ ప్రత్యక లిస్టులో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ తర్వాతే, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని నిలిచారు. అసలేంటి ఆ ప్రత్యేక రికార్డ్, ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 12, 2024 | 4:48 PM

ఈ మ్యాచ్‌లో సరిగ్గా 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ సున్నాకి అవుటయ్యాడు. తన పేరిట అరుదైన రికార్డును సృష్టించాడు. అలాగే, ఒక విషయంలో గతంలో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లందరినీ అధిగమించాడు.

14 నెలల తర్వాత టీ20లో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టీ20లో భారత జట్టుకు సారథ్యం వహించిన అతి పెద్ద వయసు కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ 36 ఏళ్ల 256 రోజుల వయసులో భారత జట్టు బాధ్యతలు చేపట్టాడు.

దీంతో శిఖర్ ధావన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఇంతకు ముందు శిఖర్ ధావన్ భారత టీ20 జట్టుకు అత్యంత సీనియర్ కెప్టెన్. 35 ఏళ్ల 236 రోజుల పాటు భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అలాగే, 35 ఏళ్ల 52 రోజుల పాటు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ.. 33 ఏళ్ల 3 రోజుల పాటు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీని అధిగమించాడు.

దీంతో పాటు భారత్ తరపున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత్ తరపున రోహిత్ ఇప్పటి వరకు 149వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు.

115 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఎంఎస్ ధోని 98 టీ20 మ్యాచ్‌లు ఆడగా, మరోవైపు హార్దిక్ పాండ్యా 92 టీ20 మ్యాచ్‌లు, భువనేశ్వర్ కుమార్ 87 టీ20 మ్యాచ్‌లు ఆడారు.




