- Telugu News Photo Gallery Cricket photos IND Vs AFG Rohit Sharma Becomes First Indian Captain Who Get Out On Duck In T20i in Telugu Cricket News
Rohit Sharma: టీ20లోనే చెత్త రికార్డ్.. భారత తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అదేంటంటే?
IND vs AFG: ఈ మ్యాచ్‌లో 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఓవర్‌లోనే రోహిత్ సున్నాకి రనౌట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద చెత్త రికార్డ్ నమోదైంది. అయితే, తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ఐ సిరీస్‌లో భారత జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Updated on: Jan 12, 2024 | 6:42 PM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 158 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఓవర్‌లోనే రోహిత్ సున్నాకి రనౌట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద చెత్త రికార్డ్ నమోదైంది.

ఈ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్న రోహిత్.. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వికెట్ తీసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు.

అలాగే, అంతర్జాతీయ టీ20ల్లో జీరోకే పెవిలియన్ చేరిన ప్రపంచ క్రికెట్‌లో 9వ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో 11వ సారి తన ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు.

చెత్త రికార్డుల విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌లో జీరోకే ఔట్ అయినా.. ఆటగాడిగా 100 అంతర్జాతీయ T20 మ్యాచ్‌లు గెలిచిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

దీంతో పాటు 14 నెలల తర్వాత టీ20లో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టీ20లో భారత జట్టుకు సారథ్యం వహించిన అత్యధిక వయసు గల కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ 36 ఏళ్ల 256 రోజుల వయసులో భారత జట్టు బాధ్యతలు చేపట్టాడు.




