భారత ఆల్‌రౌండర్‌తో గొడవ పడ్డాడు.. కుంబ్లే రికార్డుపై కన్నేశాడు.. ఆ దిగ్గజ బౌలర్ ఎవరంటే?

క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్‌లో సరికొత్త రికార్డులు రాస్తున్నాడు ఓ బౌలర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు మరే ఇతర బౌలర్‌ను ఇలా చూడలేదు. దీంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ బౌలర్లు టెస్ట్ వికెట్లు తీయడంలో ఈ బౌలర్ వెనుకే ఉన్నారు.

Venkata Chari

|

Updated on: Jul 30, 2021 | 1:34 PM

క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్‌లో సరికొత్త రికార్డులు రాస్తున్నాడు ఓ బౌలర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు మరే ఇతర బౌలర్‌ను ఇలా చూడలేదు. దీంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ బౌలర్లు టెస్ట్ వికెట్లు తీయడంలో ఈ బౌలర్ వెనుకే ఉన్నారు. ఈ విషయంలో భారత లెజెండ్ అనిల్ కుంబ్లేకు దగ్గరగా చేరాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ ఘనతను త్వరలో ప్రారంభమయ్యే భారత్ సిరీస్‌లోనే పూర్తి చేయబోతున్నాడు. అయితే, ఈ బౌలర్ కెరీర్‌లో కొన్ని మచ్చలు కూడా ఉన్నాయి. వారిలో అతి పెద్దది ఏంటంటే.. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో అసభ్యకరంగా ప్రవర్తించడం. ఈ సంఘటన ఈ బౌలర్‌కు చాలా అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సంఘటనతో మునుపటి ఫాంను కోల్పోయిన ఈ బౌలర్ ఎవరో తెలుసా..? ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ 39 ఏళ్ల క్రికెటర్ 19 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

1 / 5
2014 లో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. జేమ్స్ ఆండర్సన్ తప్పుడు కారణాలతో వార్తల్లోకి ఎక్కాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మొదటి టెస్టులో జేమ్స్ అండర్సన్.. రవీంద్ర జడేజాతో ఘర్షణ పడ్డాడు. ఈ విషయంలో భారత అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అండర్సన్‌పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, ఐసీసీ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు.

2 / 5
జేమ్స్ ఆండర్సన్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బౌలర్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీయడంలో నాలుగో స్థానంలో నిలిచాడు. మరో మూడు వికెట్లు తీస్తే.. అతను మూడవ స్థానానికి చేరుకుంటాడు. అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేయనున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడుతున్న క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 600 వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. ఏడు ప్రధాన టెస్ట్ ఆడే దేశాలపై 50 కి పైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా అండర్సన్ మాత్రమే. అండర్సన్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. అయినా కొన్ని రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 62 నాటౌట్‌గా నిలిచాడు. 11 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను భారతదేశంపై 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది 11 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన మూడవ అత్యధిక స్కోరుగా నిలిచింది.

3 / 5
జేమ్స్ ఆండర్సన్ ఇప్పటివరకు 162 టెస్టులు ఆడాడు. అలాగే 617 వికెట్లు తీసుకున్నాడు. 42 పరుగులకు ఏడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 30 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అద్భుతాలు చేశాడు. 191 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 23 పరుగులకు ఐదు వికెట్లతో ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. జేమ్స్ ఆండర్సన్ 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 18 వికెట్లు తీసుకున్నాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1003 వికెట్లు పడగొట్టాడు. 1000 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసిన 216 వ బౌలర్‌గా నిలిచాడు.

4 / 5
జేమ్స్ ఆండర్సన్ 2002 సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టులో స్థానం పొందాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 10 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని టెస్ట్ అరంగేట్రం జింబాబ్వేపై జరిగింది. మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. దీని తరువాత అండర్సన్ గాయాలతోపాటు, పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2005 తర్వాత తిరిగి జట్టులోకి చేరాడు.

5 / 5
Follow us