- Telugu News Photo Gallery Cricket photos From virat kohli to bumrah these 5 Popular Players Who Never Played For Their Home Franchise In IPL
IPL 2024: సొంత జట్టు తరపున ఐపీఎల్ ఆడని ఐదుగురు క్రికెటర్లు.. లిస్టులో టీమిండియా రన్ మెషీన్..
Players Never Played For Home Franchise In IPL: ప్రతి క్రికెటర్‌కు తన సొంత జట్టు కోసం క్రికెట్ ఆడాలనే కోరిక ఉంటుంది. అయితే మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ఐపీఎల్‌లో మాత్రం కొంతమంది ప్రముఖ క్రికెటర్లకు ఈ కల కలగానే మిగిలిపోయింది. అలాంటి ఐదుగురు ప్రముఖ క్రికెటర్ల ప్రొఫైల్ ఇక్కడ ఉంది.
Updated on: Mar 12, 2024 | 7:33 AM

Players Never Played For Home Franchise In IPL: ప్రతి క్రికెటర్‌కు తన సొంత జట్టు తరపున ఆడాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే, మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ఐపీఎల్‌లో మాత్రం కొంతమంది ప్రముఖ క్రికెటర్లకు ఈ కల కలగానే మిగిలిపోయింది. అలాంటి ఐదుగురు ప్రముఖ క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం..

విరాట్ కోహ్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టులోకి వచ్చిన కోహ్లీని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జట్టు ఎలాంటి ఆఫర్ చేయలేదు. అప్పటి నుంచి ఆర్‌సీబీ తరపున ఆడుతున్న కోహ్లి.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మినహా మరే జట్టుకు ఆడనని ఇప్పటికే ప్రకటించాడు.

దినేష్ కార్తీక్: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ కెరీర్ చివరి దశకు చేరుకుంది. కార్తీక్ మొత్తం 6 ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ XI పంజాబ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అతను తన సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరపున IPL ఆడలేకపోయాడు.

హర్భజన్ సింగ్: ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం ఆడిన హర్భజన్ సింగ్.. అతను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కూడా ఆడాడు. అయితే హర్భజన్ సింగ్ ఇప్పటివరకు పంజాబ్ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ ఆడలేదు.

శుభ్‌మన్ గిల్: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన గిల్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు, శుభ్‌మన్ తన సొంత ఫ్రాంచైజీ పంజాబ్ తరపున ఐపీఎల్‌లో ఆడలేకపోయాడు.

జస్ప్రీత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్న బుమ్రా బరోడా తరపున దేశవాళీ క్రికెట్ ఆడేవారు. కానీ, బుమ్రాకు తన సొంత ఫ్రాంచైజీలైన గుజరాత్ లయన్స్, గుజరాత్ టైటాన్స్ తరపున ఆడే అవకాశం రాలేదు.




