- Telugu News Photo Gallery Cricket photos Team India Pace Bowlers Prasidh Krishna And Mohammed Shami Ruled Out from ipl 2024
IPL 2024: ఐపీఎల్ నుంచి ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 17 ప్రారంభానికి ముందు గాయపడిన టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా సర్టిఫికెట్ పొందాలని బీసీసీఐ సూచించింది. దీని ప్రకారం కొందరు ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకున్నారు. కొందరికి బ్యాడ్ న్యూస్ రాగా, మరికొందరికి గుడ్ న్యూస్ అందించింది.
Updated on: Mar 12, 2024 | 5:14 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభానికి ముందే ఇద్దరు భారతీయ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని, టీమ్ ఇండియా నుంచి ఇద్దరు పేసర్లు రాబోయే ఐపీఎల్‌లో ఆడరని బీసీసీఐ తెలిపింది.

రిషబ్ పంత్: గత 14 నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకున్నాడు. ఈ టెస్టులో పంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024లో వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా ఆడేందుకు రిషబ్ బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

మహ్మద్ షమీ: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మడమకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది.

ప్రసిద్ధ్ కృష్ణ: భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎడమ కాలుకు ప్రాక్సిమల్ క్వాడ్రిస్ప్స్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అందుకే అతను కూడా వచ్చే ఐపీఎల్‌లో పాల్గొనలేడని బీసీసీఐ తెలిపింది.

దీంతో పాటు గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ, రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ సీజన్-17కి దూరం కావడం ఖాయం. అయితే, రిషబ్ పంత్ ఈసారి ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేయడం ఖాయం.





























