Team India: ఐపీఎల్ తర్వాత రోహిత్ సేన ఫుల్ బిజీ.. హేమాహేమీలతోనే ఢీ కొట్టనున్న భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Team India: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా 5 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వేతో జరిగే సిరీస్ షెడ్యూల్ మాత్రమే ఫిక్స్ కాగా, టీ20 ప్రపంచకప్ తర్వాత మిగతా సిరీస్‌ల షెడ్యూల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రకారం, భారత జట్టు ఆడబోయే సిరీస్‌ల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari

|

Updated on: Mar 12, 2024 | 6:54 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నారు. అంటే వచ్చే వారంలోనే భారత ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో చేరనున్నారు.

1 / 8
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభమై మే నెలాఖరు వరకు టోర్నీ జరగనుంది. అందువల్ల వచ్చే 2 నెలల పాటు టీమ్ ఇండియా ఆడదు. మరి భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు ఎక్కడ, ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

2 / 8
టీ20 ప్రపంచ కప్ 2024: టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరుగుతుంది. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ తర్వాతే భారత జట్టు సిరీస్ ఆడనుంది.

3 / 8
భారత్ వర్సెస్ జింబాబ్వే: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభమై జులై 14న ముగుస్తుంది.

4 / 8
భారత్ వర్సెస్ శ్రీలంక: శ్రీలంకతో టీమిండియా 6 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. జులై-ఆగస్టు నెలలో జరిగే ఈ సిరీస్‌లో ఇరు జట్లు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

5 / 8
భారత్ vs బంగ్లాదేశ్: సెప్టెంబర్ నెలలో బంగ్లాదేశ్‌తో భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

6 / 8
భారత్ వర్సెస్ న్యూజిలాండ్: అక్టోబర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి.

7 / 8
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్-డిసెంబర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

8 / 8
Follow us