- Telugu News Photo Gallery Cricket photos From KL Rahul to Siraj and Rishabh Pant these 3 players Base Price in IPL Mega Auction
IPL 2025: మొన్న రూ. 16 కోట్లకుపైగానే దండున్నారు.. నేడు రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చారు
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం గరిష్ట బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా తరపున ఆడిన కొందరు ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా ప్రకటించారు. ఈ లిస్ట్‌లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..
Updated on: Nov 06, 2024 | 8:54 PM

IPL 2025 Mega Auction: మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభం తొలి అడుగుగా ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలినది మెగా వేలం ప్రక్రియ. ఇందుకోసం నవంబర్ 24, 25 తేదీలను నిర్ణయించారు.

దీని ప్రకారం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆటగాళ్ల మెగా యాక్షన్ జరగనుంది. వేలం కోసం గరిష్ట బేస్ ప్రైజ్ రూ.2 కోట్లుగా ప్రకటించారు.

రిషబ్ పంత్: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రిషబ్ పంత్కు రూ.16 కోట్లు జీతం ఇచ్చారు. అయితే ఈసారి రూ.2 కోట్లకు మెగా వేలంలో పాల్గొనాలని పంత్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన బేస్ ప్రైస్ ను ప్రకటించాడు.

మహ్మద్ సిరాజ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఏడు సీజన్లు ఆడిన మహ్మద్ సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు వేలంలో కనిపించనున్న సిరాజ్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ప్రకటించాడు.

కేఎల్ రాహుల్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈసారి మెగా వేలంలో ఆడనున్నాడు. గత సీజన్లో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ నుంచి రూ.17 కోట్లు ఆర్జించాడు. ఈసారి రాహుల్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలో కనిపించనున్నాడు.




