- Telugu News Photo Gallery Cricket photos Former Pakistan Skipper Shahid Afridi Reignites Dog Meat Controversy Key Comments on Irfan Pathan
IND vs PAK: ‘కుక్క మాంసం’ వివాదం.. ఇర్ఫాన్ పఠాన్‌పై షాహిద్ అఫ్రిది విమర్శలు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Shahid Afridi Reignites 'Dog Meat' Controversy: పఠాన్ తాను ఆడుతున్న రోజుల్లో అఫ్రిదితో జరిగిన మాటల యుద్ధాన్ని వెల్లడించడం తీవ్ర కలకలం రేపింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ప్రసిద్ధి చెందిన అఫ్రిది, పఠాన్ తనపై కొన్ని వ్యాఖ్యలు చేశాడని పూర్తిగా ఖండించాడు. తనతో ముఖాముఖిగా మాట్లాడాలని సవాలు చేశాడు. ఆసియా కప్ 2025లో కొనసాగుతున్న 'హ్యాండ్ షేక్' వివాదంపైనా అఫ్రిది విమర్శలు గుప్పించాడు.
Updated on: Sep 20, 2025 | 10:20 AM

Shahid Afridi Reignites 'Dog Meat' Controversy: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మధ్య పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 2006లో పాకిస్తాన్ పర్యటన సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

2006లో ఇద్దరు క్రికెటర్ల మధ్య జరిగిన ఒక ఉద్రిక్త సంభాషణను పఠాన్ వెల్లడించడంతో వివాదం మొదలైంది. "2006 పర్యటన సందర్భంగా, మేం కరాచీ నుంచి లాహోర్‌కు విమానంలో వెళ్తున్నాం. రెండు జట్లు కలిసి ప్రయాణిస్తున్నాయి. అఫ్రిది వచ్చి నా తలపై చేయి వేసి నా జుట్టును చెరిపేశాడు. నేను ఎలా ఉన్నానో అడిగాడు" అంటూ పఠాన్ చెప్పుకొచ్చాడు.

"అప్పుడు అబ్దుల్ రజాక్ నాతో కూర్చున్నాడు. ఇక్కడ ఎలాంటి మాంసం దొరుకుతుందని నేను అతనిని అడిగాను. వివిధ జంతువుల మాంసం దొరుకుతుందని అతను నాకు చెప్పాడు. ఆ తర్వాత, కుక్క మాంసం దొరుకుతుందా అని నేను అడిగాను. నా మాట విని రజాక్ ఆశ్చర్యపోయాడు. నా ప్రకటన వెనుక కారణాన్ని అడిగాడు. నేను అఫ్రిది వైపు చూపిస్తూ అతను కుక్క మాంసం తిన్నాడని, అందుకే అతను అలా మొరుగుతున్నాడని చెప్పాను" అంటూ పఠాన్ జోడించాడు.

అయితే, ఈ వ్యాఖ్యలపై షాహిద్ అఫ్రిది తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది, పఠాన్ చెప్పింది అబద్ధమని, అలాంటి సంఘటన జరగలేదని అన్నారు. పఠాన్ నిజమైన మనిషి అయితే, తన ముందే ఇలాంటి విషయాలు మాట్లాడాలని సవాల్ చేశారు. పఠాన్ తనను తాను గొప్ప భారతీయుడిగా నిరూపించుకోవడానికి పాకిస్తాన్ ఆటగాళ్లను దూషిస్తున్నాడని కూడా అఫ్రిది ఆరోపించారు.

ఈ వివాదం ఇప్పుడు రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరు మాజీ క్రికెటర్లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం పట్ల అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.




