- Telugu News Photo Gallery Cricket photos BCCI To Drop Virat Kohli from ICC T20 World Cup 2024 squad due to slowish pitches in West Indies, America, Says Reports
కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా.! బీసీసీఐ ఆఫీస్ తగలెట్టేస్తామన్న ఫ్యాన్స్..
అమ్మ చేతి వంట, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ మర్చిపోగలమా? అది ఎప్పటికీ ఎన్నటికీ సాధ్యపడే విషయం కాదు. కానీ ఇప్పుడు మర్చిపోమంటోందా BCCI? కొత్త ఆవకాయలా, హైదరాబాద్ బిర్యానీలా ఘాటుఘాటుగా సాగే కోహ్లీ బ్యాటింగ్ సొగసు చూడతరమా?
Updated on: Mar 13, 2024 | 6:18 PM

అమ్మ చేతి వంట, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ మర్చిపోగలమా? అది ఎప్పటికీ ఎన్నటికీ సాధ్యపడే విషయం కాదు. కానీ ఇప్పుడు మర్చిపోమంటోందా BCCI? కొత్త ఆవకాయలా, హైదరాబాద్ బిర్యానీలా ఘాటుఘాటుగా సాగే కోహ్లీ బ్యాటింగ్ సొగసు చూడతరమా? కోహ్లీ లేకుంటే.. ఉప్పు లేని పప్పులా, కారం లేని కూరలా, మిర్చి లేని మిరపకాయ బజ్జీలా టీమిండియా మారిపోదా? రాబోయే టీ-20 వాల్డ్ కప్‌లో కోహ్లీ ఆడడం లేదా. పొట్టి ఫార్మాట్‌కు ఈ గట్టి బ్యాట్స్‌మన్ దూరం కానున్నాడా? ఈ వార్తలే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవర పరుస్తున్నాయి. కోహ్లీ ఫ్యాన్స్‌లో కల్లోలం రేపుతున్నాయి.

జూన్‌లో మొదలయ్యే టీ-20 ప్రపంచ కప్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడడం లేదు. యువ క్రికెటర్ల కోసం వైదొలుగుతున్నాడు.. ఇవీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా విరాట్‌తో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఐపీఎల్-2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఆధారంగా అతడి భవితవ్యం తేలనుందనే వార్తలూ వస్తున్నాయి.

ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లేకపోతే వరల్డ్ కప్ టోర్నీకి క్రేజ్ తగ్గడం ఖాయమన్నాడు. వెస్టిండీస్ - అమెరికా వేదికగా పొట్టి కప్ సంబరం జూన్ నుంచి ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాకూడదు. అభిమానుల కోణంలో చూస్తే.. ఈ వరల్డ్ కప్‌ను ఐసీసీ అమెరికాలో నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందరి దృష్టిని ఆకర్షించే టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తప్పకుండా పొట్టి కప్ కోసం ఎంపిక అవుతాడు అంటూ ఇంగ్లడ్ ప్లేయర్ బ్రాడ్ పోస్టు చేశాడు.విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడలేదు. ఇటీవలే అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే.

చాలా రోజుల విరామం తర్వాత విరాట్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. టీ-20 ప్రపంచకప్ జట్టును ప్రకటించడానికి మే ఒకటో తేదీ...చివరి రోజు. అప్పటిదాకా ఈ విషయంపై స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. మే ఒకటి వరకు కోహ్లీ అభిమానులకు ఉత్కంఠ తప్పదంటున్నాయి క్రికెట్ వర్గాలు. అటు విరాట్ ఫ్యాన్స్ అయితే.. టీమిండియా అత్యుత్తమ ప్లేయర్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోతే.. బీసీసీఐ ఆఫీస్ తగలబెట్టేస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వార్తలపై BCCI ఎలా స్పందిస్తుందో చూడాలి.




