- Telugu News Photo Gallery Clove Water On Empty Stomach: What Happens When You Start Your Day With Laung Soaked Clove Water?
Clove Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసుడు లవంగం నీటిని తాగారంటే..!
రోజును తాజాదనంతో.. కొత్త శక్తితో.. ప్రారంభిస్తే రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలా రోజును ప్రారంభించడానికి, శరీరం - మనస్సు రెండింటినీ చురుగ్గా, శక్తివంతం చేసే ఆహారాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. అటువంటి ఆరోగ్యకరమైన పోషకాలు అందించడంలో లవంగాలు ముందు వరుసలో ఉంటాయి..
Updated on: Jul 27, 2025 | 8:41 PM

రోజును తాజాదనంతో.. కొత్త శక్తితో.. ప్రారంభిస్తే రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలా రోజును ప్రారంభించడానికి, శరీరం - మనస్సు రెండింటినీ చురుగ్గా, శక్తివంతం చేసే ఆహారాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. అటువంటి ఆరోగ్యకరమైన పోషకాలు అందించడంలో లవంగాలు ముందు వరుసలో ఉంటాయి.

లవంగాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. లవంగాలు ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా లవంగాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలు నానబెట్టిన నీరు తాగడం జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన కార్యకలాపాలను సక్రియం చేస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగడం వల్ల అనేక జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది. లవంగాలలోని సహజ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ప్రతి రాత్రి ఒక గ్లాసు నీటిలో ఏడు లవంగాలను వేసి నానబెట్టి మూతపెట్టాలి. ఉదయం ఆ లవంగాల నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ ఇంటి నివారణ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.




