- Telugu News Photo Gallery Cinema photos Young Director Prashanth Varma Clarity on Jai Hanuman Casting With Kantara Hero Rishab Shetty, Telugu Heros Photos
Prashanth Varma: జై హనుమాన్ కాస్టింగ్ పై క్లారిటీ..కాంతారా హీరో ఫైనల్.!
సినిమా అప్‌డేట్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రశాంత్ వర్మ పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. వరుసగా మెగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ డైరెక్టర్. దర్శకుడిగా, రచయితగా నిర్మతగానూ బిజీగా ఉన్నారు. దీంతో ఆ సినిమా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనుమాన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్స్‌ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ, ఆ సిరీస్‌లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
Updated on: Oct 20, 2024 | 2:38 PM

సినిమా అప్‌డేట్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రశాంత్ వర్మ పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. వరుసగా మెగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ డైరెక్టర్.

దర్శకుడిగా, రచయితగా నిర్మతగానూ బిజీగా ఉన్నారు. దీంతో ఆ సినిమా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్స్‌ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ, ఆ సిరీస్‌లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ యూనివర్స్‌లో రెండు ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ అయ్యాయి. ఆ సినిమాలను ప్రశాంత్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా పీవీసీయులో మరో మూవీని ప్రకటించారు.

తాను డైరెక్ట్ చేయకపోయినా.. నిర్మాతగా కథను అందిస్తూ మహాకాళీ పేరుతో సూపర్ విమెన్ కథను తెర మీదకు తీసుకువస్తున్నారు.

తాజాగా జై హనుమాన్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, హనుమంతుడి పాత్రలో నటించటం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యింది.

అయితే కాస్టింగ్ సెట్ అయినా సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతం తన కాన్సన్‌ట్రేషన్ అంతా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మీదే ఉంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ముందు మోక్షు మూవీ కంప్లీట్ చేసిన తరువాతే నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్, ఈ లోగా తాను నిర్మాతగా ఇతర దర్శకులతో మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.




