AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ హీరోలంతా ఒకే దారిలోనే వెళ్తున్నారా ??

మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే.. అలా కాదని మేమిలాగే ఉంటామంటే మాత్రం కచ్చితంగా రేసులో వెనకబడిపోతాం..! అందుకే మన సీనియర్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతున్నారు.

Phani CH
|

Updated on: Jul 08, 2022 | 12:51 PM

Share
మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే.. అలా కాదని మేమిలాగే ఉంటామంటే మాత్రం కచ్చితంగా రేసులో వెనకబడిపోతాం..! అందుకే మన సీనియర్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతున్నారు.

మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే.. అలా కాదని మేమిలాగే ఉంటామంటే మాత్రం కచ్చితంగా రేసులో వెనకబడిపోతాం..! అందుకే మన సీనియర్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతున్నారు.

1 / 10
 ఇన్నేళ్ళు బిగ్ స్క్రీన్‌పై మాయ చేసిన ఆ నలుగురు.. ఇకపై ఓటిటిలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

2 / 10
 తాజాగా ఇందులో చిరంజీవి కూడా చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..?  టాలీవుడ్‌లో ఆ నలుగురు హీరోలంటే.. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ గుర్తుకొస్తారు.

3 / 10
కొన్ని దశాబ్ధాలుగా తెలుగు ఇండస్ట్రీ నాలుగు స్థంభాలుగా ఉన్నారు వీళ్ళు. పైగా మారుతున్న కాలంతో పాటు తమను తాము మార్చుకుంటూ వస్తున్నారు ఈ సీనియర్స్.

4 / 10
నేటి జనరేషన్ ఊహలకు తగ్గట్లు మేకోవర్ అవుతూ.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్నారు. తాజాగా ఈ నలుగురి చూపు ఓటిటి వైపు పడుతుంది. ఇప్పటికే ముగ్గరు ఎంట్రీ ఇచ్చేసారు.. చిరు మాత్రమే బ్యాలెన్స్.

5 / 10
నాగార్జున ఎప్పుడో ఓటిటిలోకి వచ్చేసారు. దాదాపు నాలుగేళ్ళ కిందే బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టారు నాగ్. మూడు సీజన్స్ పూర్తి చేసి.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం వేచి చూస్తున్నారు ఈ సీనియర్ హీరో.

6 / 10
ఇక బాలయ్య సైతం ఆహాలో అదిరిపోయే టాక్ షో చేసారు. ఈయన హోస్టుగా మారతారని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. కానీ దాన్ని అన్‌స్టాపబుల్‌తో నిజం చేసారు అల్లు అరవింద్. ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ 1గా నిలిచింది. అన్‌స్టాపబుల్ రెండో సీజన్ కూడా రెడీ అవుతుంది.

7 / 10
 వెంకటేష్ సైతం తాజాగా ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అబ్బాయి రానాతో కలిసి ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్‌లో నటిస్తున్నారు ఈయన. దీనికి రానా నాయుడు అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. వచ్చే ఏడాది ఓ ప్రముఖ ఓటిటిలో ప్రసారం కానుంది. భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్ వస్తుంది. ఇందులో తమ పాత్రలు రెండూ చాలా ఫన్ జనరేట్ చేస్తాయని ఇప్పటికే చెప్పారు రానా.

8 / 10
ఈ ముగ్గురు సీనియర్స్‌తో పాటు తాజాగా చిరంజీవి సైతం ఓటిటిలోకి వస్తున్నారని తెలుస్తుంది. వెబ్ సిరీస్‌ల వైపు చిరు మనసు వెళ్తుందని.. కథ నచ్చితే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు తనకేం అభ్యంతరం లేదని మేకర్స్‌తో మెగాస్టార్ చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

9 / 10
విభిన్నమైన పాత్రల్లో నటించాలంటే వెబ్ సిరీస్‌లే సరైన దారని నమ్ముతున్నారు చిరంజీవి. ఏదేమైనా చిరు కూడా వచ్చేస్తే.. ఆ నలుగురు ఓటిటిలోకి అడుగు పెట్టినట్లు అవుతుంది.

10 / 10
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!