AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగ చైతన్య హార్డ్ వర్క్.. ఇప్పటికైనా మార్కెట్ పెరుగుతుందా ??

ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతుంది కానీ ఇప్పటి వరకు స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు నాగ చైతన్య. ఆయనతో పాటు వచ్చిన హీరోలు.. ఆయన కంటే తర్వాత వచ్చిన వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు కానీ చైతు మాత్రం ఇప్పటికీ మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోయాడు. వెనకాల అక్కినేని అంటూ పెద్ద సామ్రాజ్యమే ఉన్నా ఎందుకో చైతూ మాత్రం అక్కడే ఆగిపోయాడు. స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కవుట్ అయితే అవ్వడం లేదు. కానీ ప్రతీ హీరో కెరీర్‌కు ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 13, 2024 | 8:09 PM

Share
ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతుంది కానీ ఇప్పటి వరకు స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు నాగ చైతన్య. ఆయనతో పాటు వచ్చిన హీరోలు.. ఆయన కంటే తర్వాత వచ్చిన వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు కానీ చైతు మాత్రం ఇప్పటికీ మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోయాడు. వెనకాల అక్కినేని అంటూ పెద్ద సామ్రాజ్యమే ఉన్నా ఎందుకో చైతూ మాత్రం అక్కడే ఆగిపోయాడు.

1 / 6
స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కవుట్ అయితే అవ్వడం లేదు. కానీ ప్రతీ హీరో కెరీర్‌కు ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది.. అలాంటి సినిమా వచ్చినపుడు ఎవరు వద్దన్నా కచ్చితంగా దశ మారిపోతుంది. చూస్తుంటే నాగ చైతన్యకు అలాంటి సినిమా తండేల్ అనిపిస్తుంది. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ చూసిన తర్వాత నాగ చైతన్య కెరీర్‌కు మలుపు అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు.

2 / 6
కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చందూ మొండేటి కూడా భారీ సినిమాతోనే వస్తున్నాడు. ఇందులో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్నాడు నాగ చైతన్య. అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్‌లోకి వెళ్లడం.. అక్కడ ఆర్మీ వాళ్లను పట్టుకుని జైల్లో వేయడం.. ఆ తర్వాత అక్కడ్నుంచి ఇండియాకు వాళ్లు ఎలా తిరిగొచ్చారు అనే నేపథ్యంలో తండేల్ వస్తుంది. టీజర్ చూస్తుంటేనే గ్రాండియర్ అర్థమవుతుంది.

3 / 6
కచ్చితంగా ఈ సినిమాతో చైతూ మార్కెట్ డబుల్ అవుతుందేమో అనిపిస్తుంది. 2023లో దసరా సినిమాతో ఎలాగైతే నాని మార్కెట్ రెండింతలు పెరిగిందో.. అలా చైతూ కూడా తండేల్‌తో మార్కెట్ పెంచుకునేలా కనిపిస్తున్నాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో వచ్చిన తండేల్ వీడియోలో చైతూ లుక్ అదిరిపోయింది.. సినిమా కథను కూడా ఈ 2 మినిట్స్‌లోనే చెప్పే ప్రయత్నం చేసాడు చందూ.

4 / 6
ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ లో చిక్కుకున్న సంఘటన గతంలో జరిగింది. శ్రీకాకుళంలోని కొందరు జాలరులు గతంలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడ ఆర్మీకి చిక్కారు. కొంతకాలం తర్వాత విడుదలయ్యారు. అదే పాయింట్‌ను తీసుకుని ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నాడు చందూ మొండేటి. 'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురితెప్పేదేలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే' అంటూ నాగ చైతన్య శ్రీకాకుళ యాసలో చెప్పే డైలాగులతో టీజర్ మొదలైంది.

5 / 6
అలాగే పాక్ జైలులో నాగ చైతన్యని అక్కడి పోలీసులు చిత్ర హింసలు పెట్టడం.. భారత్ మాతా కీ జై అంటూ చెప్పడం ఇవన్నీ బాగున్నాయి. ఇక టీజర్ అంతా ఒక ఎత్తు అయితే.. చివర్లో చైతు ప్రేయసిగా సాయి పల్లవిని పరిచయం చేసిన తీరు బాగుంది. మొత్తంగా చూడాలిక.. చైతూ కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌గా తండేల్ మారుతుందో లేదో..?

6 / 6
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..

బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...