
Family Star: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం లాంటి బడా సినిమా కూడా సంక్రాంతికి రానుంది. దాంతో ఈ పోటీ నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ముంబైలో ఉన్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది రోజులుగా బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె ముంబైలో ఓ అభిమానితో దిగిన ఫోటో వైరల్ కావటంతో రామాయణం ప్రాజెక్ట్ కోసమే ఆమె ముంబై వెళ్లారంటున్నారు ఫ్యాన్స్.

Quotation Gang: ప్రియమణి, సన్నీ లియోన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన యాక్షన్ మూవీ కొటేషన్ గ్యాంగ్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వంలో గాయత్రి సురేష్, వివేకానందం సంయుక్తంగా నిర్మించారు.

Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 థియేటర్లలో అభిమానుల అత్యుత్సాహం ప్రేక్షకులను గాయాల పాలు చేసింది. సినిమా ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా థియేటర్లలో భారీగా బాణాసంచా కాల్చటంతో అవి ప్రేక్షకుల మీదకు దూసుకువచ్చి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kaala Paani: సూపర్ హిట్ ఇండియన్ వెబ్ సిరీస్ కాలా పానికి సీక్వెల్ ఎనౌన్స్ అయ్యింది. తొలి సీజన్ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాగా, షార్ట్ గ్యాప్‌లోనే సెకండ్ సీజన్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సీజన్ 2కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.