- Telugu News Photo Gallery Cinema photos Vijay devarakonda movie Kingdom geting hype for these reasons
Kingdom: రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్ హైప్.. కారణం అదేనా ??
విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కింగ్‌డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో టీజర్ రిలీజ్ అయింది. తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా గురించి మాట్లాడారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
Updated on: Apr 02, 2025 | 6:45 PM

''మీరు ఎంతైనా ఊహించుకోండి... అంతకు మించే ఉంటుంది కింగ్‌డమ్. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. లాజిక్కులు ఉంటాయి. కథ ఉంటుంది. ఎవరేం డౌటు అడిగినా చెప్పడానికి నేనూ, గౌతమ్ సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు. కేజీయఫ్‌లాగా ఉంటుందట కదా మూవీ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ '' కేజీయఫ్ బ్యాక్ డ్రాప్‌తో మా సినిమాకు సంబంధం ఉండదు.

కానీ యాక్షన్ సీక్వెన్స్... డ్రామా మాత్రం అంతకు మించేలా ఉంటుంది'' అని అన్నారు. మధ్య విజయ్ దేవరకొండ కూడా కింగ్‌డమ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విధానం గురించి మాట్లాడారు.

ఆ రోజు డైరక్టర్ స్పాట్‌లో లేరని చెప్పినా, వాయిస్ ఓవర్ కంటెంట్ నచ్చడంతో 'నువ్వున్నావ్ కదా.. చెప్పేద్దాం పద' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తీరును గుర్తుచేసుకున్నారు..

కింగ్‌డమ్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ హిట్ గ్యారంటీ అనే టాక్ బాగా వినిపిస్తోంది. ఏమాత్రం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు విజయ్. స్టోరీ సెలక్షన్‌లోనూ ఆయన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు.

గతేడాది విడుదలైన ఫ్యామిలీస్టార్ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుని తీరాలని ఫిక్సయ్యారు మన రౌడీ హీరో.




