- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood Latest Trending Topics on 29th July 2023 telugu movie news
Tollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. అనుష్క అభిమానులకు నిరాశ.. కీర్తి రూట్ బీటౌన్..
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రేయసిగా నటించనున్నారు కీర్తీ సురేష్. ఈ సినిమాకు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంకా మూవీకి టైటిల్ నిర్ణయించలేదు. ఇందులో వరుణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుంది. నవంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేస్తారు.
Updated on: Jul 29, 2023 | 9:30 PM

Miss Shetty Mr polishetty - వాయిదా పడింది 'మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి' సినిమాను ఆగస్టు 24న విడుదల చేద్దామనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. సరికొత్త రిలీజ్ డేట్‌ని, సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని అనౌన్స్ చేసింది యువీ క్రియేషన్స్. కామెడీ ఫీస్ట్ ఉంటుందని డిక్లేర్ చేశారు మేకర్స్.

Rajanikanth - మార్చమన్నారు 'జైలర్' సినిమా డైరక్టర్ నెల్సన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. 'బీస్ట్' సినిమా విడుదల కాకమునుపే నెల్సన్ తనకు 'జైలర్' కథ చెప్పారన్నారు. 'బీస్ట్' ఫ్లాప్ కావడంతో నెల్సన్‌తో సినిమా చేయొద్దని చాలా మంది సలహా ఇచ్చారని అన్నారు. అయితే, అవేమీ పట్టించుకోవద్దని సన్‌పిక్చర్స్ వాళ్లు అన్నారని, 'జైలర్' ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

Keerthy - రూట్ బాలీ! బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రేయసిగా నటించనున్నారు కీర్తీ సురేష్. ఈ సినిమాకు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంకా మూవీకి టైటిల్ నిర్ణయించలేదు. ఇందులో వరుణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుంది. నవంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేస్తారు.

Stree - భయపెట్టే స్త్రీ రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా స్త్రీ2. అమర్ కౌశిక్ డైరక్ట్ చేస్తున్నారు. హారర్ సినిమాగా తెరకెక్కుతోంది. చందేరిలో గత కొన్నాళ్లుగా కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది స్త్రీ2.

Ayushman - మనసులో మాట సంగీతం ద్వారా తన మనసులోని భావాలను వ్యక్తం చేస్తానని అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. నటుడిగానే కాదు, గాయకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు ఆయుష్మాన్. పాట ద్వారా శ్రోతల మనసులతో మాట్లాడాలని ప్రయత్నిస్తానని చెప్పారు. తన పాటలను ప్రజలు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.




