- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like rashmika mandanna nidhi agarwal pooja hegde doing promotions for their movie hit
సినిమా హిట్స్ కోసం బాధ్యతలు మోస్తున్న బ్యూటీస్
ఈ జనరేషన్ హీరోయిన్స్ గ్లామర్ డాల్స్‌గా మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఛాన్స్ దొరికితే బాధ్యతలు మోసేందుకు కూడా రెడీ అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్‌తో పాటు స్టార్ హీరోలు ప్రమోషన్స్ చేయని సినిమాల విషయంలో బరువంతా అందాల భామ మీదే పడుతోంది. హరి హర వీరమల్లు రిలీజ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్
Updated on: May 30, 2025 | 9:22 PM

హరి హర వీరమల్లు రిలీజ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్, ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

పవన్ అందుబాటులో లేకపోవటంతో పబ్లిసిటీ బాధ్యత స్వయంగా తీసుకున్నారు నిధి. ఈవెంట్స్‌కు వీలైనంతగా గ్లామర్ యాడ్ చేస్తున్నారు.

సెకండ్ ఇన్సింగ్స్‌లో పూజ హెగ్డే కూడా స్పీడు పెంచారు. హీరోల కన్నా ఓ అడుగు ముందే ఉండేలా చూసుకుంటున్నారు. రీసెంట్‌గా రెట్రో ప్రమోషన్స్ విషయంలో పూజ తీరు హాట్ టాపిక్ అయ్యింది.

గతంలో బయటకు వచ్చేందుకు ఇష్టపడని నయనతార కూడా ఇప్పుడు ప్రమోషన్స్ బాధ్యత తీసుకుంటున్నారు. పబ్లిసిటీ విషయంలో ఈ జనరేషన్‌ను ఇన్‌స్పైర్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన్న.

సినిమాలో యాక్ట్ చేసి వెళ్లిపోవటం కాకుండా... ఆ సినిమాతో ట్రావెల్ చేస్తున్నారు శ్రీవల్లి. ఛావా, యానిమల్ లాంటి సినిమాలను సౌత్ ఆడియన్స్‌కు దగ్గర చేయటంలో కీ రోల్ ప్లే చేశారు నేషనల్ క్రష్.




