- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes like ram pothineni, varun tej, Siddu Jonnalagadda upcoming movie details
గేర్ మార్చిన యంగ్ హీరోలు.. ఈ సారి టార్గెట్ మిస్ అయ్యేదేలే
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు... రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జానర్ ట్రై చేస్తున్నారు. ఈ సారి టార్గెట్ మిస్ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్. వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాలో ఉన్న రామ్ పోతినేని... కంప్లీట్‌గా రూట్ మార్చారు.
Updated on: Jun 19, 2025 | 10:06 PM

వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు... రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఫాలో అయిన ఫార్ములాను పక్కన పెట్టి కొత్త జానర్ ట్రై చేస్తున్నారు. ఈ సారి టార్గెట్ మిస్ అవ్వకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు యంగ్ హీరోస్.

వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాలో ఉన్న రామ్ పోతినేని... కంప్లీట్‌గా రూట్ మార్చారు. స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో ఊరమాస్ లుక్స్‌లో కనిపించిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ఇప్పుడు కూల్ లవర్ భాయ్‌గా కనిపించబోతున్నారు. ఆంధ్రా కింగ్ తాలుకా పేరుతో వస్తున్న సినిమాలో వింటేజ్ లవ్ వైబ్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా రూటు మార్చారు. ఇన్నాళ్లు సీరియస్ మోడ్‌లో ప్రయోగాలు చేసిన వరుణ్, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా... సక్సెస్‌కు మాత్రం దూరమయ్యారు. అందుకే ఈసారి హిట్ ఫార్ములాతో హారర్ కామెడీ జానర్ ట్రై చేస్తున్నారు.

అక్కినేని వారుసుడు అఖిల్ కూడా ట్రెండ్ మార్చారు. లవర్ భాయ్‌గా సక్సెస్‌లు వచ్చినా.. మాస్ హీరో అనిపించుకోవాలన్న కోరిక తీరకపోవటంతో మాస్ యాక్షన్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వీళ్లే కాదు.. విశ్వక్‌సేన్, కిరణ్ అబ్బవరం, సిద్దూ జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా నెక్ట్స్ సినిమాల కోసం కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ఆ హీరోలకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.




